Mahesh Kumar Goud : కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగా మాట్లాడుతారు

కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రెడ్‌లైన్ దాటితే ఉపేక్షించమని హెచ్చరించారు.

Maheshkumar goud

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీలో కొంత మేర స్వేచ్ఛ ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా రెడ్‌లైన్ దాటితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగా తీన్మార్ మల్లన్న కొత్తగా రాజకీయ పార్టీని పెట్టిన విషయంపై ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఎవరు పెట్టినా ఆహ్వానిస్తామన్నారు. తీన్మార్ మల్లన్నను బీసీల కోసం పోరాడే నాయకుడిగా గౌరవిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసిషన్స్ వ్యతిరేకించారు కాబట్టే మల్లన్నను సస్పెండ్ చేశామన్నారు.

కల్వకుంట్ల కవిత గురించి ప్రస్తావిస్తూ.. కవితకు విలీనం దినోత్సవం కి ఏం సంబంధం అని, ఆమె అసలు పుట్టింది ఎప్పుడు, కవితకు చరిత్ర తెలుసా అని అన్నారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. విలీన దినోత్సవాన్ని విమోచనం అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ను బీజేపీ అవమానిస్తోందన్నారు. బీజేపీ నేతల తీరుతో పటేల్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఆపరేషన్ పోలో పేరిట పటేల్ హైదరాబాద్ ను దేశంలో విలీనం చేశారన్నారు. విలీనం నాటికి బీజేపీ పార్టీ పుట్టనే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు.