• Telugu News
  • /Telangana

Traffic Restrictions | ఇవాళ హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఆ మార్గాల్లో అస‌లు వెళ్ల‌కండి..!

Traffic Restrictions | ఇవాళ హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions ) విధించారు. అఖండ‌-2( Akhanda-2 ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Cyberabad Traffic Police ) వెల్ల‌డించారు.

Reported by: raj | తెలంగాణ‌ | Nov 28, 2025, 7:51 am IST
Read Time: 3 mins
Traffic Restrictions | ఇవాళ హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఆ మార్గాల్లో అస‌లు వెళ్ల‌కండి..!

Traffic Restrictions | హైద‌రాబాద్ : ఇవాళ హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions ) విధించారు. అఖండ‌-2( Akhanda-2 ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Cyberabad Traffic Police ) వెల్ల‌డించారు. అఖండ‌-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని కైథాలాపూర్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు బాల‌య్య అభిమానులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్నందున, వాహ‌న‌దారుల‌కు, ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..
భ‌ర‌త్ న‌గ‌ర్ నుంచి ఎర్ర‌గ‌డ్డ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను మూసాపేట జీహెచ్ఎంసీ ఆఫీసు వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు. కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ మీదుగా వాహ‌నాల‌ను అనుమ‌తిస్తారు. కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ వైపు నుంచే వ‌చ్చే వాహ‌నాల‌ను ఐడీఎల్ లేక్ వ‌ద్ద మ‌ళ్లించి జేఎన్టీయూ మీదుగా అనుమతించ‌నున్నారు.

మాదాపూర్, హైటెక్‌సిటీ నుంచి కైథాలాపూర్ వైపు వచ్చే వాహ‌నాల‌ను నెక్సాస్ మాల్, జేఎన్టీయూ రోడ్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మార్గాల్లో కాకుండా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని వాహ‌న‌దారులు, ప్ర‌యాణికుల‌కు పోలీసులు సూచించారు.