Traffic Restrictions | హనుమాన్‌ జయంతి.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Restrictions | నగరంలో మంగళవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు విజయయాత్ర నిర్వహిస్తున్నందున ఆయా రూట్లలో ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటాయని పేర్కొన్నారు.

  • Publish Date - April 23, 2024 / 07:01 AM IST

Traffic Restrictions | నగరంలో మంగళవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు విజయయాత్ర నిర్వహిస్తున్నందున ఆయా రూట్లలో ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటాయని పేర్కొన్నారు.

గౌలిగూడ రామమందిరం నుంచి హనుమాన్‌ విజయయాత్ర ప్రారంభమై శంకర్ షేర్ హోటర్, బడేమియా పెట్రోల్ పంపు, గౌలిగూడ చమాన్, రంగ్ మహల్ జంక్షన్, జీపీవో, యూసుఫ్ కంపెనీ, డీఎంహెచ్‌ఎస్, చాదర్‌ఘాట్ ఎక్స్‌రోడ్, కాచిగూడ ఎక్స్ రోడ్, బొగ్గులకుంట ఎక్స్‌రోడ్, ఈడెన్ గార్డెన్, లింగంపల్లి ఎక్స్‌రోడ్, వైఎంసీఎ- నారాయణగూడ, షాలిమర్, వాటర్ ట్యాంక్ నారాయణగూడ, బర్కత్‌పుర పోస్టాఫీస్‌ నారాయణగూడ ఫ్లైఓవర్, క్రౌన్ ఓవర్ ఫ్లైఓవర్, మెట్రో కేఫ్, వీఎస్టీ ఎక్స్ రోడ్, ఇందిరాపార్క్ మీదుగా సాగుతుందని పేర్కొన్నారు.

అశోక్ నగర్ టీ జంక్షన్, స్ట్రీట్ నం.9 హయత్ నగర్, కవాడిగూడ, డీబీఆర్ కాలేజీ, బైబిల్ హౌస్‌, సైలింగ్ క్లబ్, కర్బాలా మైదాన్ కవాడిగూడ, ప్యాట్నీ, రాణిగంజ్, సీటీవో, సీటీవో ఫ్లైఓవర్, బాలంరాయ్, సీటీవో ఫ్లైఓవర్, సేఫ్ ఎక్స్‌ప్రెస్, బోయిన్‌పల్లి ఎక్స్‌రోడ్, టివోలీ, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి మార్కెట్, మస్తాన్ హోటల్‌ మీదుగా తాడ్‌బండ్‌ హనుమాయన్‌ ఆలయానికి విజయ యాత్ర చేరుతుందని తెలిపారు. విజయ యాత్రకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా వాహనాలను మళ్లిస్తున్నట్లు వివరించారు. ఆయా మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సీపీ వాహనదారులకు సూచించారు.

Latest News