విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఆయనపై జూబ్లిహిల్స్ కేసులో నమోదైన కేసుల్లో ఈ కస్టడీని పోలీసులు కోరినట్లుగా సమాచారం. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపార వేత్తతో పాటు, సుదర్శన్‌రావు అనే బాధితులు వేర్వేరు ఘటనల్లో చేసిన ఫిర్యాదు మేరకు రాధాకిషన్‌రావుపై నమోదైన కేసుల్లో విచారణకు కోర్టు ఆయనను కస్టడీకి అనుమతించినట్లుగా తెలుస్తుంది. కస్టడీ ముగిసిన అనంతరం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
NAMPALLY COURT | రాధాకిషన్ రావుకు రెండు రోజుల కస్టడీ .. జూబ్లిహల్స్ కేసుల్లో నాంపల్లి కోర్టు నిర్ణయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

Latest News
వైరల్..చేతులపై నుంచి 100 కార్లు..శరీరంపై నుంచి 100 బైక్ లు !
ఆస్తులు దానం చేసింది నేను కాదు..అదంతా ఫేక్ న్యూస్ : సీపీఐ నేత నారాయణ
భారత్‌కు ఐఎండీ హెచ్చరిక.. ఎల్‌నినో అధికారికంగా ప్రారంభం!
హైదరాబాద్ లో కాక్రోచ్ ల ధర్నా
స్కాలర్షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్
ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
వైరల్.. నాగబంధం సినిమా అనంత పద్మనాభ స్వామి విగ్రహం
వైరల్ వీడియో..రోప్ జంపింగ్ లో మహిళ దుర్మరణం
ఎగిరే కార్లు ‘జెట్సన్ వన్’వచ్చేస్తున్నాయ్ !
స్థిరంగా బంగారం, వెండి ధరలు