విధాత, వరంగల్ ప్రతినిధి: పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేసి మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. జనవరి చివరి వారంలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ కు ట్రాఫిక్ బందోబస్త్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వరంగల్ సీపీ సింగ్ ఆధ్వర్యంలో కమిషనరేట్ కు చెందిన డిసిపి, అదనపు డిసిపి, ఏసీపీ లతో హన్మకొండ జిల్లా కేంద్రం నుండి జాతర జరిగే మేడారం వరకు ఉన్న ప్రధాన రోడ్డు మార్గాన్ని సీపీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ మార్గంలో వాహన పార్కింగ్, హోల్డింగ్, ట్రాఫిక్ సమస్య లు తలెత్తే ప్రదేశాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన బందోబస్త్ చర్యలను సీపీ క్షేత్ర స్థాయిలో సమీక్ష జరిపారు. అనంతరం సీపీ గట్టమ్మ వద్ద ఆర్టీసీ బస్సు లు, ప్రవైట్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలతో పాటు, జాతర ప్రదేశాన్ని చేరుకునే మార్గాలు, అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై సీపీ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న సీపీ
బుధవారం ఉదయం మేడారానికి చేరుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ సింగ్ సమ్మక్క -సారలమ్మ లను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు.
సీపీ వెంట ములుగు ఎస్పీ సుధీర్ కేకన్, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, ములుగు ఓ. ఎస్. డి శివం ఉపాధ్యాయ, అదనపు డిసిపి ప్రభాకర్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, సత్యనారాయణ, సతీష్ బాబు, ములుగు డీఎస్పీ రవీందర్ తో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
War Ending Plan | రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? 20 అంశాలతో శాంతి ప్రణాళిక ముసాయిదా!
World’s Busiest Airports : అత్యంత రద్దీ ఏయిర్ పోర్టులలో…న్యూఢిల్లీకి ఏడో స్థానం
