విధాత : షాపింగ్ మాల్స్, మల్టీఫుల్ థియేటర్స్..మెట్రో రైలు స్టేషన్లలో, విమానాశ్రయాల్లో ఎస్కలేటర్లు, లిఫ్టుల వినియోగం సాధారణంగా మారిపోయింది. ఒక్కోసారి ఎస్కలేట్లరు, లిఫ్టుల వినియోగం ప్రజలకు ప్రాణంతకంగా కూడా మారుతున్నాయి. తాజాగా ఓ యూనివర్సిటీలో ఎస్కలేటర్ ప్రమాదం వీడియో వైరల్ గా మారింది.
బంగ్లాదేశ్ బార్క్ యూనివర్సిటీలో విద్యార్థులు పై ఫ్లోర్ నుంచి కిందకు ఎస్కలేటర్ పై వస్తున్నారు. అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఎస్కలేటర్ వేగంగా వెళ్లడం మొదలు పెట్టింది. దీంతో దానిపై నిలుచున్న విద్యార్థులు భయాందోళనలతో హడలిపోయారు. ఎస్కలేటర్ వేగంగా సాగడంతో దానిపై నిలుచున్న వారంతా వేగంగా బయటకు విసిరేయబడినట్లుగా జంపింగ్ మాదిరిగా బయటకు దిగాల్సిన ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపునే వారంతా బయటపడ్డారు.
ఎస్కలేటర్ వేగం నియంత్రించే మెషిన్స్ పనిచేయకపోవడంతో అది స్పీడ్ గా ముందుకు సాగిందని నిపుణులు చెబుతున్నారు. చాల అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయంగాని..గాయాలుగాని లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటలీలోని జియాజ్జా డెల్లా రిపబ్లికాలోని ఓ రైల్వే స్టేషన్లో గతంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎస్కలేటర్ ఎక్కిన ప్రయాణికులు కిందికి దిగుతుండగా ఒక్కసారిగా వేగం పెరిగింది. దీంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. అమెరికా కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ (CPSC) డేటా ప్రకారం ఎస్కలేటర్ సంబంధిత ప్రమాదాలతో ఆ దేశవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 30 మరణాలకు కారణమవుతాయని, 17,000మంది గాయాల బారిన పడుతున్నారని గణంకాలు వెల్లడిస్తుండటం ఆందోళన కల్గించేదిగా ఉంది. ఈ లెక్కలు చూస్తే ఎస్కలేటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఇవి కూడా చదవండి :
Real Estate Mafia | సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లూ ఇళ్లు కొనలేని దుస్థితి.. ఇక మధ్యతరగతి మాటేంటి?
Senior Heros | సీనియర్ హీరోలకి తలనొప్పిగా మారిన హీరోయిన్ సెలెక్షన్… టాలీవుడ్‌లో ఏజ్ గ్యాప్‌పై సీరియస్ చర్చ
