మనం మనం దోస్తులం.. బుడ్డోడితో కాకి ఫ్రెండ్‌షిప్!..వీడియో వైరల్

మనుషుల మధ్య స్నేహం సర్వసాధారణం. కొన్ని జంతువులు కుక్కలు, పిల్లులు, ఆవులు కొన్ని రకాల జంతువులతో కూడా మనుషులు స్నేహం చేయడం చూస్తుంటాం. కానీ, అడవి కాకితో ఓ చిన్నబాబుతో ఫ్రెండ్‌షిప్ చేయడం వింతగా మారింది.

మనుషుల మధ్య స్నేహం సర్వసాధారణం. కొన్ని జంతువులు కుక్కలు, పిల్లులు, ఆవులు కొన్ని రకాల జంతువులతో కూడా మనుషులు స్నేహం చేయడం చూస్తుంటాం. కానీ, అడవి కాకితో ఓ చిన్నబాబుతో ఫ్రెండ్‌షిప్ చేయడం వింతగా మారింది. వాళ్లిద్దరి మధురమైన స్నేహం పై తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటర్నెట్ లో దూసుకుపోతున్న ఈ హార్ట్ వార్మింగ్ వీడియోలో 2 ఏళ్ల ఓట్టో (Otto) అనే బాలుడు, తన దోస్తు అయిన రస్సెల్‌ (Russell) అనే కాకి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.

ఓట్టో బయట ఆడుతుంటే రస్సెల్‌ వెంటనే అతని వెంట పరిగెడుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు కిటికీ పక్కన కూర్చుని అతని కోసం ఎదురుచూస్తుంది. మరీ ముఖ్యంగా ఓట్టో కిండర్‌గార్టెన్‌ నుంచి తిరిగి వచ్చే సమయానికి తలుపు దగ్గర నిలబడి అతన్ని “సేఫ్‌గా ఇంటికొచ్చేలా” చూసుకుంటుంది ఆ అడవి కాకి. ఆ బుడ్డోడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ కాకి వచ్చి వాడితో ఆడుకుండడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. దీంతో తమకు ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ కావాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఒక అధ్యయనం ప్రకారం.. కాకులు మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకుంటాయి. అంతే కాదు ఏళ్లు గడిచినా తమకు హాని చేసిన వారిని గుర్తిస్తాయంటా.