Viral Video | తమిళనాడులోని ఓ ఆలయంలో ఏనుగు చేసిన పని ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. కాళ్లు నొప్పిగా ఉండటంతో మావటి దగ్గర మసాజ్ చేయించుకున్న ఓ ఏనుగు.. మరో కాలికి కూడా మసాజ్ చేయమని క్యూట్‌గా సైగలతో అడగడం, ఆ సమయంలో ఏనుగు అమాయకత్వం, దాని బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న అరుళ్మిగు ఆది కుంభేశ్వరర్ ఆలయానికి చెందిన మంగళం అనే ఏనుగుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆలయ ప్రాంగణంలో మంగళరం ఏనుగు తన మావటి పక్కన ఎంతో ప్రశాంతంగా, ఒద్దికగా నిలబడి ఉంది. నుదుటిపై సాంప్రదాయ తిలకం, మెడలో అందమైన గంటల దండ ధరించి మంగళం ఏనుగు చూడముచ్చటగా ఉంది. పొద్దుట్నుంచి తిరిగి తిరిగి మంగళం అలసిపోయిందని భావించిన మావటి.. దాని కాళ్లకు మెల్లిగా మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మర్దనతో హాయిగా అనిపించడంతో కాసేపు కనేళ్లు మూసుకుని చిన్నపిల్లలా అస్వాదించడం ఆ వీడియోలో కనిపించింది. ఒక కాలికి మసాజ్ అయిపోగానే క్యూట్‌గా మంగళం ఏనుగు తన మరో కాలిని ముందు చాచింది. ఆ కాలు అయిపోయింది కదా.. ఇప్పుడు ఈ కాలికి కూడా మసాజ్ చేయు అన్నట్లుగా క్యూట్‌గా మావటివైపు చూసింది. చిన్న పిల్లాడిలా ఆ ఏనుగు చేసిన సైగలు, దాని బాడీ లాంగ్వేజ్, అమాయకత్వం ఇప్పుడు సోషల్‌మీడియాలో అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఈ క్యూట్ వీడియోను @lifewshroots అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. ‘పెద్ద శరీరం.. కానీ చిన్నపిల్ల మనసు‘ అంటూ క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. అలాగే ‘ ఇది కేవలం ఓ బేబీ మాత్రమే.. కానీ చాలా పెద్ద బేబీ. మర్యాదగా ఫుట్ మసాజ్ అడుగుతుంది.‘ అని కూడా క్యాప్షన్‌లో జోడించాడు. ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2.12 లక్షల మంది లైక్ కూడా చేశారు. ఈ వీడియోకు కామెంట్లు కూడా విపరీతంగా వస్తున్నాయి.
