Mudumalai Elephant Video : ఆహా..తొలి మంచు తెరలలో గజరాజును చూడాల్సిందే!
ముదుమలై అభయారణ్యంలో తొలి మంచు తెరల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న గజరాజు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అద్భుత దృశ్యం అంటూ నెటిజన్ల ప్రశంసలు.
విధాత: పచ్చదనంతో కూడిన అడవి..అందులో తెల్లవారుజాము ఉషస్సు వేళ తొలి మంచు తెరలతో శోభిల్లుతున్న ప్రకృతి. ఇంతటి అద్భుత ప్రకృతి సోయగాలకు పరవశించి పులకించింది ఓ గజరాజు. ముదుమలై అభయారణ్యంలో ఓ అందమైన శీతాకాలపు ఉదయాన్ని అస్వాదిస్తున్న గజరాజు వీడియో వైరల్ గా మారింది.
ఇంతటి అద్బుతమైన, అందమైన ప్రకృతి ప్రసాదించినందుకు ఆ దేవుడికి నమస్కరిస్తుంది ఆ గజరాజు అంటూ అటవీ అధికారి సుశాంత్ నంద ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగానే అద్బుత ప్రకృతి..అందులో గజరాజు పరవశం అరుదైన దృశ్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
YouTuber Anvesh Case : యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
Muslim Woman Dance In Old City : పాతబస్తీ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మైనార్టీ మహిళా డాన్స్ వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram