Muslim Woman Dance In Old City : పాతబస్తీ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మైనార్టీ మహిళా డాన్స్ వైరల్

పాతబస్తీలో గంగా-జమునా తెహజీబ్ వెల్లివిరిసింది. వైకుంఠ ఏకాదశి ఊరేగింపులో ఓ ముస్లిం మహిళ బురఖా ధరించి భక్తితో కోలాటం ఆడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Muslim Woman Dance In Old City : పాతబస్తీ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మైనార్టీ మహిళా డాన్స్ వైరల్

విధాత, హైదరాబాద్ : హిందూ ముస్లింలు జీవిస్తున్న హైదరాబాద్ పాతబస్తీ అంటే సమస్యాత్మకమైన ప్రాంతంగా చూస్తుంటారు. అక్కడంతా ముస్లింల జులూమ్ నడుస్తుందన్న వాదన వినిపిస్తుంటుంది. కాని స్థానికంగా ఉన్న ప్రజలు పరస్పరం మతసామరస్యాన్ని పాటిస్తూ..ఒకరి సాంప్రదాయాలను విశ్వాసాలను మరొకరు గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుంటారు. ఇందుకు నిదర్శనమన్నట్లుగా వైకుంఠ ఏకాదశి సందర్బంగా నిర్వహించిన వేంకటేశ్వరుడి ఊరేగింపులో ఓ ముస్లిం మహిళ హిందూ నృత్యకారులతో కోలాటం, డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

చార్మినార్ వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలలో భాగంగా నిర్వహించిన వెంకటేశ్వరస్వామి ఊరేగింపులో బురఖా ధరించిన ఓముస్లిం మహిళ భక్తితో కోలాటం ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఊరేగింపులో “రఘుకుల తిలక రారా..నిన్ను ఎత్తి ముద్దులాడెదెరా..కోసల రామా రారా..కౌసల్య రామా రారా” అన్న పాట, అలాగే వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వుడిని పాటలు డీజేలో ప్లే అవుతుండగా..హిందూ మహిళల కోలాట బృందంతో కలిసి ఆ ముస్లిం మహిళ భక్తి పారవశ్యంతో డాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు..ఇదికదా! హైదరాబాద్..తెలంగాణకు సొంతమైన గంగాజమునా సంస్కృతి అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని హైదరాబాద్ సీపీ సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “హైదరాబాద్‌లోని గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి ఇది నిలువుటద్దం” అని కొనియాడారు.

ఇవి కూడా చదవండి :

Gold, Silver Price| తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు
New Year celebrations| న్యూఇయర్ వేడుకల వేళ..సజ్జనార్ వార్నింగ్