• Telugu News
  • /National

Delhi Hotel Room Prices | ఏఐ ఇంపాక్ట్ ఎఫెక్ట్‌.. ఒక్క నైట్ స్టేకి రూ.35 ల‌క్ష‌లు.. ఢిల్లీలో విప‌రీతంగా పెరిగిన హోట‌ల్ గ‌దుల ధ‌ర‌లు

Delhi Hotel Room Prices | ఈ నెల 16 నుంచి 20 వ‌ర‌కు ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026 (India AI Impact Summit 2026) జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోట‌ల్ గ‌దుల ధ‌ర‌లు భారీగా పెరిగాయి (Hotel Room Prices).kj

Reported by: Tech | జాతీయం | Feb 09, 2026, 8:37 pm IST
Read Time: 5 mins
Delhi Hotel Room Prices | ఏఐ ఇంపాక్ట్ ఎఫెక్ట్‌.. ఒక్క నైట్ స్టేకి రూ.35 ల‌క్ష‌లు.. ఢిల్లీలో విప‌రీతంగా పెరిగిన హోట‌ల్ గ‌దుల ధ‌ర‌లు

Delhi Hotel Room Prices | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో హోట‌ల్ రూమ్స్ ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి (Delhi Hotel Room Prices). ఈ నెల 16 నుంచి 20 వ‌ర‌కు ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026 (India AI Impact Summit 2026) జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ్మిట్‌కు దాదాపు 100 దేశాల నుంచి విదేశీ ప్ర‌తినిధులు, సాంకేతిక రంగ నిపుణులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోట‌ల్ గ‌దుల ధ‌ర‌లు భారీగా పెరిగాయి (Hotel Room Prices).

స‌ద‌స్సు జ‌రిగే రోజుల్లో హోట‌ళ్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. న‌గ‌రంలోని దాదాపు 98 శాతం హోట‌ల్స్‌ ఇప్ప‌టికే హౌస్‌ఫుల్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 35 వేల కంటే ఎక్కువ మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంగానే హోట‌ల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటిన‌ట్లు తెలుస్తోంది. తాజ్ ప్యాలెస్ స‌హా నగరంలోని అగ్రశ్రేణి లగ్జరీ హోటళ్ల రూమ్ చార్జీలు భారీగా స్థాయిలో పెరిగాయి.

ఒక్క రాత్రి స్టేకి రూ.35 ల‌క్ష‌లు..
సాధార‌ణంగా ఢిల్లీలోని ప్ర‌ముఖ హోట‌ల్‌లో ఒక రాత్రికి బ‌స చేయాలంటే రూ.20 వేల నుంచి రూ.40 వేల వ‌ర‌కూ ఛార్జ్ చేస్తారు. కానీ ఈ స‌మ్మిట్ జ‌రిగే తేదీల్లో హోట‌ల్ గ‌దుల రేట్లు విప‌రీతంగా పెరిగాయి. ట్రావెల్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న వివ‌రాల ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రి 19, 20 తేదీల్లో కొన్ని ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో గ‌ది ధ‌ర ఒక్క‌రాత్రి రూ.ల‌క్ష‌ల్లో ఉంది. ఓ ప్ర‌ముఖ హోట‌ల్‌లో ఒక రాత్రికి గది అద్దె రూ.30 లక్షలు దాటడం విశేషం. దీనికి తోడు జీఎస్టీ, ఇత‌ర ఛార్జెస్ క‌లుపుకుని మ‌రో రూ.5 ల‌క్ష‌లు అద‌నం. అంటే హోట‌ల్ గ‌దిలో ఒక్క‌రాత్రి బ‌స‌కు రూ.35 ల‌క్ష‌ల‌న్న‌మాట‌. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు దాదాపు అన్ని ల‌గ్జ‌రీ హోట‌ల్స్‌లో రూమ్ ధరలు ఇలాగే ఉన్నాయి.

హోటల్ ధరలపై ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ ప్రభావం..

ఫైవ్‌స్టార్ హోటల్సే కాదు, సాధార‌ణ హోట‌ళ్ల‌లోనూ రూమ్ ధ‌ర‌లు ఇంచుమించు ఇదే రేంజ్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి 17-21 మధ్య 90 శాతంకు పైగా ఆక్యుపెన్సీ ఉందని ఫెడ‌రేష‌న్ ఆఫ్ అసోసియేష‌న్స్ ఇన్ ఇండియ‌న్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (FAITH) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా తెలిపారు. “ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ ప్రభావం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని హోటల్ ధరలపై తీవ్రంగా పడింది. ఫిబ్రవరి 16-20 మధ్య ఢిల్లీలోని పలు ఫైవ్ స్టార్ హోటళ్లలో గది ధర రాత్రికి రూ. 1 లక్షకు పైగానే ఉంది” అని అని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

Gold Silver Price Today : షాకింగ్..అకస్మాత్తుగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
India Gold Mine | మన దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇదే! 99 శాతం అక్కడి నుంచే సరఫరా!

Bengaluru | త‌ల్లి ప్రైవేట్ ఫొటోల‌ను బాయ్ ఫ్రెండ్‌కు పంపిన కుమార్తె

Liquor Shops Close: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్