New Year celebrations| న్యూఇయర్ వేడుకల వేళ..సజ్జనార్ వార్నింగ్

న్యూ ఇయర్ వేడుకల వేళ మందుబాబులకు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. మద్యం సేవించి రోడ్లపైకి వస్తే..వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని స్పష్టం తెలిపారు.

New Year celebrations| న్యూఇయర్ వేడుకల వేళ..సజ్జనార్ వార్నింగ్

విధాత, హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల(New Year celebrations) వేళ మందుబాబులకు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్ట్రాంగ్ వార్నింగ్( CP Sajjannar warning) జారీ చేశారు. మద్యం సేవించి రోడ్లపైకి వస్తే..వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని స్పష్టం తెలిపారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటలనుంచే కొనసాగుతాయని తెలిపారు. తనిఖీలు కేవ‌లం ఈ రోజుకే పరిమితం కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతుందని వెల్లడించారు. న్యూఇయర్ వేడుకలు అంతా సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ కోరుతుందన్నారు.

న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ +91 94906 16555 కు సమాచారం పంపించాలని సూచించారు.

హైదరాబాద్ లో రాత్రి 11నుంచి 2గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు అవసరం మేరకు బంద్ చేస్తామని సీసీ వెల్లడించారు. అన్ని ప్రైవేటు వాహనాలు సిటీలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.

ట్యాంక్‌బండ్‌, నెక్లస్‌ రోడ్‌ వంటి చోట్ల రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున రెండుగంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 217 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారని, ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌, నెక్లస్‌రోడ్‌ వంటి రద్దీ ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్‌ ఉన్నచోట ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పైకి అనుమతించనున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌,ట్రాఫిక్‌ నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.