Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్తే మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ కలహాల్లో మౌనం వహించడం మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఊహించని ధనలాభాలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. భవిష్యత్తు గురించి బంధుమిత్రులతో సమాలోచనలు చేస్తారు. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప సంకల్ప బలంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందప్రదమైన క్షణాలు గడుపుతారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కావాలంటే పట్టుదల అవసరం. ఉద్యోగంలో ఆచి తూచి నడుచుకోవాలి. ముఖ్యమైన పనులు ఈ రోజు వాయిదా వేస్తే మంచిది. కొన్ని సంఘటనలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ప్రియమైన వారితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరగవచ్చు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి పరమైన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. సోదరులతో అనుబంధం దృఢ పడుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. పరోపకార పనులతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. అన్నివిధాలా అనుకూలమైన సమయం. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యమైన ధనలాభాలు అందుకుంటారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. మీ సంపద, ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశాలున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో ఘర్షణలు రాకుండా జాగ్రత్త వహించండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలతో చాలా సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. సమాజంలో ప్రతిష్ఠ, ప్రజాదరణ పెరగవచ్చు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తెలివిగా నిర్వహించండి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో ముందడుగు వేసి సత్ఫలితాలు అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. కీలక వ్యవహారాల్లో సమయానుకూల నిర్ణయాలు మేలు చేస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram