Ram Charan – Upasana | రామ్ చరణ్-ఉపాసనల కవల పిల్లల పేర్లు రివీల్.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు
Ram Charan - Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల దంపతులకు ఇటీవల పండంటి కవలలు జన్మించడంతో అభిమానుల్లో అపారమైన ఆనందం వెల్లివిరిసింది. జనవరి 31న ఒక మగ బిడ్డ, ఒక ఆడ బిడ్డ జన్మించగా ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు.
Ram Charan – Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల దంపతులకు ఇటీవల పండంటి కవలలు జన్మించడంతో అభిమానుల్లో అపారమైన ఆనందం వెల్లివిరిసింది. జనవరి 31న ఒక మగ బిడ్డ, ఒక ఆడ బిడ్డ జన్మించగా ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వద్దకు వేలాదిమంది అభిమానులు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొనగా, అభిమానుల శుభాకాంక్షలతో ఆ పరిసరాలు సందడిగా మారాయి.
ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన తన కవల పిల్లలతో మెగా ఇంటికి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే నామకరణోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో సాదాసీదాగా పూర్తి చేసినట్లు సమాచారం. పండితుల సూచనలు, జాతక వివరాలు, జన్మనక్షత్రాలను పరిశీలించిన తరువాతే పిల్లలకు పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు చిన్నారులకు ఏ పేర్లు పెట్టారన్న ఆసక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అభిమాన వర్గాల్లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం కుమారుడికి “శివరామ్”, కూతురికి “అన్వీరా దేవీ” అనే పేర్లు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పేర్లు జాతకానికి అనుగుణంగా ఎంపిక చేసినవేనని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మెగా కుటుంబం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక ధృవీకరణ లేకపోయినా అభిమానులు మాత్రం ఈ పేర్లను సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మెగా ఇంట కవలల రాకతో కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొనగా, చిన్నారుల పేర్లపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram