విధాత:జార్ఖండ్‌లో జడ్జిని వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించే విషయమై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో కొత్త ట్రెండ్ కన్పిస్తోంది… తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు. పోలీసులు లేదా సీబీఐకి జడ్జి ఫిర్యాదు చేస్తే.. వారు కనీసం స్పందించడం లేదు. జ్యుడిషియరీకి ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా సీబీఐ ఏ మాత్రం సహకరించడం లేదు. “దేశంలో గ్యాంగ్‌స్టర్స్‌తో సంబంధమున్న అనేక కేసులు ఉన్నాయి.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిపై కూడా కేసులు ఉన్నాయి… ఇలాంటి సమయంంలో వాట్సస్‌మెసేజ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు పంపి జడ్జీలను మానసికంగా వేధిస్తున్నారు. సీబీఐకి ఫిర్యాదు చేసినా… సిబీఐ ఏమీ చేయలేకపోతోంది. సీబీఐ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఇది చాలా బాధాకరమ”ని జస్టిస్ రమణ అన్నారు. ఈ కేసు విచారణ సమయంలో సీనియర్ లాయర్ వీకే బిజు జోక్యం చేసుకుని ఇంటర్‌వెన్షన్ పిటీషన్ వేసేందుకు అనుమతి కోరారు. కేరళలోని సిట్టింగ్ మహిళా జడ్జి, తెలంగాణ జడ్జిపై కూడా ఇలాంటి దాడి జరుగుతోందని అన్నారు. జడ్జీలకు భద్రత కల్పించే విషయమై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది.
తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు
<p>విధాత:జార్ఖండ్‌లో జడ్జిని వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించే విషయమై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో కొత్త ట్రెండ్ కన్పిస్తోంది… తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు. పోలీసులు లేదా సీబీఐకి జడ్జి ఫిర్యాదు చేస్తే.. వారు కనీసం స్పందించడం లేదు. జ్యుడిషియరీకి ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా సీబీఐ ఏ మాత్రం సహకరించడం లేదు. "దేశంలో గ్యాంగ్‌స్టర్స్‌తో […]</p>
Latest News

స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు
స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు