Smita Sabharwal: కంచ గచ్చిబౌలి పోలీస్ నోటీస్ లపై స్మితా సబర్వాల్ స్ట్రాంగ్ రిప్లై !
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఇమేజ్ ను రీపోస్ట్ చేసిన వ్యవహారంలో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఐఏఎస్, తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ సమాధానం ఇచ్చారు. హాయ్ హైదరాబాద్ ట్వీట్ ను తాను రీ పోస్ట్ చేశాననని..ఈ పోస్టును సోషల్ మీడియాలో 2000 మంది రీపోస్టు చేశారని గుర్తు చేశారు. మరి వారందరికీ నోటీసులు ఇస్తారా ? అని ప్రశ్నించారు. కొంతమందిని సెలెక్ట్ చేసి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని.. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలని తన సమాధానంలో స్పష్టం చేశారు.

Smita Sabharwal: : కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఇమేజ్ ను రీపోస్ట్ చేసిన వ్యవహారంలో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఐఏఎస్, తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ సమాధానం ఇచ్చారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరించి సమగ్ర సమాచారం ఇచ్చానని స్మితా సబర్వాల్ తెలిపారు. హాయ్ హైదరాబాద్ ట్వీట్ ను తాను రీ పోస్ట్ చేశాననని..ఈ పోస్టును సోషల్ మీడియాలో 2000 మంది రీపోస్టు చేశారని గుర్తు చేశారు. మరి వారందరికీ నోటీసులు ఇస్తారా ? అని ప్రశ్నించారు. కొంతమందిని సెలెక్ట్ చేసి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని.. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలని తన సమాధానంలో స్పష్టం చేశారు. ఈ మేరకు స్మితా సబర్వల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
తెలంగాణలో స్మితా సబర్వాల్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ ఇమేజ్ ను రీపోస్ట్ చేశారంటూ స్మిత సబర్వాల్ కు 179 బీఎన్ఎస్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. అయితే తన మాదిరిగా చేసిన మిగతా వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటూ స్మితా సబర్వాల్ ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం సెక్రటరీగా ఓ వెలుగు వెలిగిన స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక పోస్టులకు దూరమైంది. ప్రస్తుతం తెలంగాణ టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్మితాసబర్వాల్ ప్రపంచ అందాల సుందరి ఎంపిక పోటీల నిర్వాహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో గచ్చిబౌలి భూముల వివాదంలో చేసిన ట్వీట్ ఆమెపై ప్రభుత్వ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసిందన్న చర్చ సాగుతోంది.