Ram Attack Student : పొట్టేలుతో ఆట..సచ్చాంరో బాబోయ్

గొర్రె పొట్టేలుతో ఆటపట్టించిన విద్యార్థులపై అది దాడి చేసిన వీడియో వైరల్. ఇష్టారాజ్యంగా ఆటాడితే ఇదే ఫలితం అంటూ నెటిజన్లు ఫన్ని కామెంట్లు చేస్తున్నారు.

విధాత: పచ్చిక మైదానంలో తన మానన తాను గడ్డి మేస్తున్న ఓ గొర్రె పొట్టేలుతో ఆకతాయి విద్యార్థులు ఆటాడుకునేందుకు చేసిన ప్రయత్నం తిరగబడిన ఘటన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఘనా దేశంలో కొండ ప్రాంతంలోని పచ్చిక మైదానంలో ఓ గొర్రె పొట్టేలు గడ్డి మేస్తుంది. అటుగా వెళ్లిన నలుగురు విద్యార్ధులు ఆ గొర్రెను చూసి దానితో ఆట మొదలు పెట్టారు. తాను ఆహారం కోసం గడ్డి మేసే పనిలో ఉంటే..నాతో మీ ఆటాలేందిరో అనుకుంటూ చిర్రెత్తిపోయిన గొర్రె పొట్టేలు వారి వెంట పడి కుమ్మేసింది.

గొర్రె పొట్టేలు దెబ్బకు విద్యార్థుల తలోదిక్కు పరుగు తీశారు. అయినా వదిలి పెట్టకుండా వారి వెంట పడి మరీ..తరుముతూ కుమ్మేసింది. ఊహించని పొట్టేలు దాడితో బెంబెలెత్తిపోయిన విద్యార్థులు పరుగెత్తలేక..తలతో అది ఢీకొట్టిన దెబ్బలకు తాళలేక కింద పడి పోయారు. మమ్మల్ని వదిలేయ్ బాబోయ్ అంటూ పొట్టేలును ప్రాదేయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారిపోగా..నెటిజన్లు ఫన్ని కామెంట్లతో మరింత హాస్యాన్ని పండిస్తున్నారు.

Latest News