Jubilee Hills By-poll Analysis | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమితో బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితి!

అధికారం కోల్పోయినప్పటి నుంచి ఉప ఎన్నిక వరకు బీఆరెస్‌లో ఆత్మవిమర్శ కనిపించడంలేదనే విమర్శ ఉంది. తాజా ఫలితంతోనైనా పార్టీలో లోతైన సమీక్ష సాగుతోందా? అనే చర్చ సాగుతోంది. జూబ్లీ ఫలితం పక్కన పెట్టి పార్టీ కేడర్ లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకుంటే కిందిస్థాయిలో బలమున్న పార్టీగా స్థానిక ఎన్నికల్లో తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటున్నారు.

ktr leadership under scrutiny after jubilee hills defeat

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Jubilee Hills By-poll Analysis | ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత హైదరాబాద్ పై గట్టి పట్టును సాధించిన బీఆర్ఎస్ పలుకుబడి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓటమితో తగ్గిపోయినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతాయంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పరిసర నియోజకవర్గాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ ఫిరాయించి చేయిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి సున్న ఫలితాలకు తోడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి బీఆర్ఎస్ లో ఒక రకమైన చర్చను లేవనెత్తింది. తాజాగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన ప్రచారం, సవాళ్ళ నేపథ్యంలో ఓటమిపాలు కావడం కేటీఆర్, హరీష్ రావు నాయకత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ కుమార్తె కవిత తాజా ట్వీట్ దీనికి ఉదాహరణగా పేర్కొంటున్నారు.

Jubilee Hills By-poll Analysis | ‘జూబ్లీ’ ఫలితం ప్రభావమెంత? లాభనష్టాల లెక్కల్లో పార్టీలు!

తాజా ఓటమి నేపథ్యంలో అధికార పార్టీ పై చేసిన అతి విమర్శలు, అనవసర ఆరోపణల తీవ్రత కొద్దికాలమైనా తగ్గించుకోకుంటే ఆ పార్టీ నాయకత్వం అభాసుపాలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజా సమస్యల పై స్పందించడంతోపాటు, ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించకుండా ప్రచార పటాటోపాన్ని, సోషల్ మీడియాను నమ్ముకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఫాం హౌజ్ కే పరిమితం కావడం, కేసీఆర్ కుమార్తె కవిత పార్టీ నుంచి బయటికి వచ్చి చేస్తున్న విమర్శలిప్పుడు ఆ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పావులు కదిపితే ఆ పార్టీ ఇబ్బందులపాలయ్యే అవకాశం ఉంది. ఒంటి చేత్తో ఉప ఎన్నికలను ఎదుర్కొన్న కేటీఆర్ నాయకత్వం పై అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. ఓటమికి ఆయనను బాధ్యునిగా భావిస్తున్నవారున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, ఎమ్మెల్యేల బలంతో పాటు తెలంగాణ ఉద్యమ పార్టీగా ఇంకా బలమైన పట్టు, గుర్తింపు ఉన్న నేపథ్యంలో తాజా పరిస్థితులను సమీక్షించుకుని ఆచితూచి అడుగులేస్తే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందంటున్నారు.

Revanth Reddy Strategy | అభ్యర్థి ఎంపిక, టీమ్‌ వర్క్‌, సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణ.. జూబ్లీహిల్స్ విజయంలో ఇవే కీలక అంశాలు!

కానీ, అధికారం కోల్పోయినప్పటి నుంచి ఉప ఎన్నిక వరకు ఆ పార్టీలో ఆత్మవిమర్శ కనిపించడంలేదనే విమర్శ ఉంది. తాజా ఫలితంతోనైనా పార్టీలో లోతైన సమీక్ష సాగుతోందా? అనే చర్చ సాగుతోంది. జూబ్లీ ఫలితం పక్కన పెట్టి పార్టీ కేడర్ లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకుంటే కిందిస్థాయిలో బలమున్న పార్టీగా స్థానిక ఎన్నికల్లో తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే అనుభవంతో అడుగులేస్తే సాధ్యమవుతోందంటున్నారు. టెంపరితనం, సోషల్ మీడియాను నమ్ముకుంటే ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. పార్టీపై కేసీఆర్ రోజువారీ మానిటరింగు, జిల్లా, ద్వితీయ శ్రేణి నాయకులతో సంబంధాలు పెంపొందించుకోకుండా ఆ పార్టీ పరిస్థితి కుదుటపడే అవకాశం లేదంటున్నారు. పరిస్థితి తిరుగబడితే అంతర్గత సంక్షోభం తలెత్తే ముప్పుకూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

Read Also |

Kavitha : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కవిత ట్వీట్ వైరల్ !
KTR : కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ తీర్పు సారంశం ఇదే : కేటీఆర్‌
Ponnam Prabhakar| బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కుతోనే తగ్గిన కాంగ్రెస్ మెజార్టీ: మంత్రి పొన్నం