సాల్ట్ ప్రాజెక్టుకు..1860 కోట్లు ఆర్థికసహాయం.

సాల్ట్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం విధాత:అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు (IBRD) ఆంధ్ర అభ్యసన పరివర్తన (Supporting andhra's Learning Transformation) (SALT) కార్యక్రమానికి నిధులను మంజూరుచేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి 250 మిలియన్ అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో 1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య […]

Reported by: Venkat | ఆంధ్ర ప్రదేశ్ | IST
Read Time: 4 mins
సాల్ట్ ప్రాజెక్టుకు..1860 కోట్లు ఆర్థికసహాయం.

సాల్ట్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం

విధాత:అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు (IBRD) ఆంధ్ర అభ్యసన పరివర్తన (Supporting andhra’s Learning Transformation) (SALT) కార్యక్రమానికి నిధులను మంజూరుచేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి 250 మిలియన్ అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో 1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గారికి జునైద్ కమల్ అహ్మద్ (కంట్రీ డైరెక్టర్, ఇండియా) (ప్రపంచ బ్యాంకు) నుండి లేఖ అందింది. నాడు నేడులో భాగంగా మౌలిక సౌకర్యాల రూప కల్పన, నిర్వహణ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం తన నిబద్ధతను పునరుద్ఘాటించి లక్ష్యాల సాధనకు కట్టుబడి వున్నది . ముఖ్యంగా పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం లొనూ, పారిశుధ్య కార్మికుల నియామకం ,శిక్షణలకు ప్రధమ ప్రాధాన్యతనిస్తుంది. మొదటి దశ నాడు నేడు పనులు జరిగిన తీరుతో సంతృప్తి చెందటంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న అనేక పధకాలపై ప్రభుత్వం తో చర్చలు జరిపిన ఈ పధకం బృందం ప్రతిపాదనతో ప్రపంచ బ్యాంకు రుణాన్ని మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.

Supporting Andhra’s Learning Transformation (SALT) Project
ఆంధ్రా అభ్యాసనా పరివర్తన సహాయక సన్నాహక పధకo

ఈ ప్రాజెక్ట్ లోని కీలక అంశాలు:
(i) పునాది అభ్యాసాన్ని బలోపేతం చేయడం,
(ii) ఉపాధ్యాయ-విద్యార్థుల పరస్పర సంబంధాలను నాణ్యతను మెరుగుపరచటం
(iii) నాణ్యమైన సేవలను అందించుటకు సంస్థాగత సామర్థ్యములను, సామాజిక సంస్థల ప్రేమేయాన్ని బలోపేతంచేయడం .

ప్రాజెక్ట్ వ్యవధి:

ప్రాజెక్ట్ 2021-22 సంవత్సరం నుండి 2026-27 సంవత్సరాలు (లేదా 5 సంవత్సరాలకాల పరిమితి కలిగి వుంటుంది).
ప్రపంచ బ్యాంకు నుండి ఆంద్ర రాష్ట్రం 1,860.,కోట్ల,ఆర్థిక సహాయం (రుణం) అందుకుంటుంది.