Sri Reddy | ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై విమర్శలు.. నటి శ్రీ రెడ్డిపై కేసు నమోదు
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేష్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

విధాత, హైదరాబాద్: టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేష్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కర్నూలు త్రీటౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియ ద్వారా వైసీపీకి మద్దతుగా ప్రచారం సాగించే శ్రీరెడ్డి ఎన్నికల అనంతరం కూడా ఎంత మాత్రం తగ్గకుండా టీడీపీ కూటమిపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన విమర్శల నేపథ్యంలో పోలీసు కేసు నమోదైంది.