విధాత: హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ స్టేడియం లో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2020-21లో , ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపర్చినారు. ఇందులో ఎం.తిమ్మరాజప్ప లాంగ్ జంప్ క్రీడలో స్వర్ణ పతాకం,అలాగే100 మీటర్ల అంశం లో రాజతపతకం సాధించాడు.చెన్నకేశవరెడ్డి 800 మీటర్ల విభాగంలో రజతంతోపాటు 400 మీటర్ల విభాగం లో కాంస్యం సాధించినాడు.తిరుమలరావు (ఓపెన్ విభాగంలో) లాంగ్ జంప్ లో కాంస్యపతకం,మాధవి షాట్ పుట్ లో కాంస్యం సాధించారు. ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు.. ఇన్ని (6)పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. బి.సుజాత సెక్షన్ ఆఫీసర్ AP సెక్రటేరియట్ కోచ్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనపర్చారు.ఇదే ఉత్సాహంతో రాబోవు ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2021-22 లో సుజాత ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని టీం మేనేజర్ కిషోర్ తెలిపారు.