కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి
విధాత: రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ ను తీయాలన్న డ్రైవర్ ను విచక్షణారహితంగా కొట్టారు. దుండగులు. ఈ ఘటన కావాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్డుగా ఉన్న బైక్ ను తీయాలని హారన్ కొట్టాడు బస్సు డ్రైవర్. దీంతో అతనితో వాహనదారుడు వాగ్వివాదానికి దిగారు. కారులో బస్సును వెంబడించి డ్రైవర్ పై దాడికి దిగారు.
కాగద.. డ్రైవర్ పై 14 మంది దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై కావలి డిఎస్పి వెంకటరమణ నిందితులపై హత్యా ప్రయత్నం..ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టిడిపి కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సైకో పాలనలో ఇలాంటి దాడులు తప్ప ఇంకేం ఉంటుందని విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram