Private Bus Travels| బిగ్ బాస్ చూస్తూ..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవింగ్
తాజాగా ఏపీలో ఓ ప్రైవేట ట్రావెల్ బస్సు డ్రైవర్ బిగ్ బాస్ టీవీ షో చూస్తూ బస్సును 80-90 కి.మీ స్పీడ్ తో నిర్లక్ష్యంగా నడుపుతున్న వీడియో వైరల్ గా మారింది. 'ప్రమాదాలకు ఇలాంటివి కూడా కారణం' అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
విధాత: రోడ్డు ప్రమాదాల్లో ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels) బస్సుల(Bus Accident)దే ఆధిపత్యం. అధిక వేగం..బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం, డ్రైవర్ల నిర్లక్ష్యం వెరసి ప్రమాదాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ప్రమాదాలకు అడ్రస్ గా మారాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారిన పరిస్థితి. ఇటీవల కర్నూల్ లో జరిగిక వేమూరి కావేరీ బస్సు దగ్థంలో 19మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. వరుసగా ఎన్ని ప్రమాదాలు జరిగినా..ఎంత మంది చచ్చినా బస్సులు నడపడంలో ట్రావెల్స్ యజమాన్యాలు, సిబ్బంది చూపుతున్న నిర్లక్ష్యం మాత్రం వదలడం లేదు.
తాజాగా ఏపీలో ఓ ప్రైవేట ట్రావెల్ బస్సు డ్రైవర్ బిగ్ బాస్ టీవీ షో(Bigg Boss) చూస్తూ బస్సును 80-90 కి.మీ స్పీడ్ తో నిర్లక్ష్యంగా నడుపుతున్న వీడియో వైరల్ గా మారింది. ‘ప్రమాదాలకు ఇలాంటివి కూడా కారణం’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ట్రావెల్స్ మీద..ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డ్రైవర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram