Site icon vidhaatha

విజయవాడ విమానాశ్రయానికి కోడ్‌-ఈ హోదా

అందుబాటులోకి కొత్త రన్‌వే
ఇకపై భారీ విమానాలకు అనుకూలం

విధాత,గన్నవరం:విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోడ్‌-ఈ హోదా లభించింది. దీంతో ఇకపై బోయింగ్‌ 737, 747 లాంటి భారీ స్థాయి విమానాల రాకకు వీలుంటుంది. స్థానిక విమానాశ్రయంలో విస్తరించిన నూతన రన్‌వే 26ను గురువారం ఉదయం అధికారులు లాంఛనంగా ప్రారంభించడంతో అందుకు మార్గం సుగమమైంది. దిల్లీ నుంచి ఉదయం 7.10 గంటలకు విజయవాడ చేరుకున్న ఎయిర్‌ ఇండియా(ఏఐ-459) సర్వీసు ల్యాండింగ్‌తో నూతన రన్‌వే అందుబాటులోకి వచ్చినట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ మధుసూదనరావు తెలిపారు. 3360 మీటర్ల రన్‌వేతో భారీ విమానాల రాకకు అవరోధాలు తొలగినట్లు పేర్కొన్నారు.

Exit mobile version