Site icon vidhaatha

మీ కార్యకర్తలను మీరే ప్రేరేపించి దాడులు చేయించారనే అనుమానం కలుగుతోంది

విధాత‌: భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది.పట్టాబి మాట్లాడే బాష సభ్య సమాజం తలదించుకొనేలా వుంది.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పాలెగాళ్లు, దద్దమ్మలు అనడాన్ని ఆలోచించుకోవాలి,జగన్ అన్న పాలనలో రాష్ట్రం సుబిక్షంగా వుందన్నారు హోంమంత్రి సుచ‌రిత‌.

గుజరాత్ లో డ్రగ్స్ దొరికితే ఎపిని డ్రగ్స్ మాఫియా గా మార్చారని అనడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు,గంజాయి రవాణా అరికట్టడానికి సెబ్ ఏర్పాటు చేశారు.నక్కా ఆనందబాబును విచారించడానికి పోలీసులు వచ్చారు. ఆదారాలు ఇవ్వమని అడిగారు ఆయ‌న‌ను కేవలం సమాచారం మాత్రమే అడిగారు.

ప్రబుత్వంపై, సిఎం జగన్ పై పదే పదే బురద చల్లుతున్నారు.టీడీపీ నాయకులు నీచమైన బాష మాట్లాడటం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇలాంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు వెనకనుండి నడుపుతున్నాడని బలంగా నమ్ముతున్నాం.డిజిపి ఆఫీస్ కి కూతవేటు దూరంలో దాడి చేశారంటున్నారు.మీ కార్యకర్తలను మీరే ప్రేరేపించి దాడులు చేయించారనే అనుమానం కలుగుతోంది.

వ్యక్తి గతంగా దూషించడం, అవమానకరంగా మాట్లాడటం తగదు.పార్టీ కార్యాలయంపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని తిట్టడాన్ని ఎందుకు ఖండించరు.డిజిపి ఫోన్ తీయలేదు అనేది అవాస్తవం.. అమరవీరుల పెరేడ్ లో డీజీపీ వున్నారు.మొదటి నుండి రాష్ట్ర ప్రతిష్టకు, ముఖ్యమంత్రికి భంగం కలిగేలా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.చంద్రబాబు పదేపదే అసత్యాన్ని ప్రచారం చేసి నమ్మించాలని చూస్తున్నారు.టీడీపీ నాయకులు చేస్తున్న నీచ రాజకీయాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.అసత్య ఆరోపణలు చేసినా, ప్రచారం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సుచ‌రిత హెచ్చ‌రించారు.

Exit mobile version