విశాఖ టు గరివిడి.. చీపురుపల్లిలో బొత్స అనూష పొలిటికల్ ప్లాన్ మామూలుగా లేదుగా!

రాజకీయం అంటే కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, అందరినీ కలుపుకుపోవడం. ఈ విద్య డాక్టర్ బొత్స అనూషకు బాగానే అబ్బింది. విజయనగరం పుట్టినిల్లు, విశాఖపట్నం మెట్టినిల్లు.. కానీ ఇప్పుడు గరివిడే ఆమె పొలిటికల్ అడ్డా! డాక్టర్ బొత్స అనూష రాజకీయ అడుగులు చాలా ప్లాన్డ్ గా పడుతున్నాయి.

విశాఖ టు గరివిడి.. చీపురుపల్లిలో బొత్స అనూష పొలిటికల్ ప్లాన్ మామూలుగా లేదుగా!

రాజకీయం అంటే కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, అందరినీ కలుపుకుపోవడం. ఈ విద్య డాక్టర్ బొత్స అనూషకు బాగానే అబ్బింది. విజయనగరం పుట్టినిల్లు, విశాఖపట్నం మెట్టినిల్లు.. కానీ ఇప్పుడు గరివిడే ఆమె పొలిటికల్ అడ్డా! డాక్టర్ బొత్స అనూష రాజకీయ అడుగులు చాలా ప్లాన్డ్ గా పడుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె వేస్తున్న వ్యూహాలు ఫలించేలా కనిపిస్తున్నాయి.

ఒకపక్క జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మరోపక్క మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.. ఇలా సీనియర్లను కలుపుకుపోతూనే తనకంటూ సొంత టీమ్ ను తయారు చేసుకుంటున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా, ఆ గ్రామంలోని పాత తరం నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూనే, యువతకు పార్టీ బాధ్యతలు గుర్తుచేస్తున్నారు. ఆమె స్వయంగా డాక్టర్ కావడం, అందులోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయడంతో విద్యావంతుల మద్దతు కూడా ఆమెకు లభిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ఆమె పర్యటనలు సాగుతున్నాయి. తండ్రి రాష్ట్ర స్థాయి పనుల్లో బిజీగా ఉన్నా, నియోజకవర్గంలో ఆ లోటు తెలియకుండా అనూష సమర్థవంతంగా మేనేజ్ చేస్తున్నారు.