పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉంది..!
విధాత: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని..ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.రాజకీయ లబ్ధి కోసం పట్టాభిని హత్య చేసి.. ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి సానుభూతి పొందాలని చంద్రబాబు తత్వం అన్నారు.ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు. అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేయించిన […]

విధాత: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని..ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.రాజకీయ లబ్ధి కోసం పట్టాభిని హత్య చేసి.. ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి సానుభూతి పొందాలని చంద్రబాబు తత్వం అన్నారు.ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.
అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేయించిన చంద్రబాబు..ఇవాళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలన్నారు.మరోవైపు టీడీపీ నేత పట్టాభిరామ్ కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన ఆయన.. తర్వాత హనుమాన్ జంక్షన్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.కానీ తర్వాత ఆయన ఇంటికి మాత్రం చేరలేదు.
తాను ఉన్న వాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి జైలు నుంచి పట్టాభి విజయవాడకు బయల్దేరారు.పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించారు.పట్టాభిరామ్ కారుతో పాటు మరో రెండు వాహనాలనే అనుమతించారు.మిగతా వాహనాలను అక్కడే ఆపేశారు. పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకుంటారనే ఉద్దేశంతో.. ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది.