అంతర్జాతీయ సర్వీసులకోసం నూత‌న ర‌న్ వే

విధాత‌: జిల్లాలోని విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన నూతన రన్ వేతో అంతర్జాతీయ సర్వీసులు రాష్ట్రానికి రావడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ నివాస్‌ అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన రన్ వే ప్రారంభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రన్ వేతో బోయింగ్ 737 లాంటి అంతర్జాతీయ సర్వీసులు రావడానికి వీలుంటుందని కలెక్టర్ తెలిపారు. నూతన రన్ వే విస్తరణకు సహకరించిన దావాజీగూడెం, అల్లాపురం, బుద్దవరం నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ […]

అంతర్జాతీయ సర్వీసులకోసం నూత‌న ర‌న్ వే

విధాత‌: జిల్లాలోని విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన నూతన రన్ వేతో అంతర్జాతీయ సర్వీసులు రాష్ట్రానికి రావడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ నివాస్‌ అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన రన్ వే ప్రారంభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రన్ వేతో బోయింగ్ 737 లాంటి అంతర్జాతీయ సర్వీసులు రావడానికి వీలుంటుందని కలెక్టర్ తెలిపారు. నూతన రన్ వే విస్తరణకు సహకరించిన దావాజీగూడెం, అల్లాపురం, బుద్దవరం నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ నివాస్‌తో కలిసి రన్ వేను జేసీ మాధవిలత, ఎమ్మెల్యే వంశీ, విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు సందర్శించారు.