విధాత: రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. పొందూరులో జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నేతన్నలకు కేంద్రం నుంచి సాయం అందించాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు.
పొందూరు ఖాదీకి ఖండాంతర ఖ్యాతి : జిల్లాలో పొందూరులో తయారు చేసే ఖాదీ వస్త్రాల కు ఖండాంతర ఖ్యాతి ఉంది. ఇక్కడి నేత వస్త్రాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఎంతో మక్కువ తో ధరించేవారు. ఆయన కట్టుతో పొందూరు వస్త్రానికి ఎంతో గొప్పతనం లభించింది. ప్రఖ్యాత న టుడు అక్కినేని నాగేశ్వరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ నటులు ఈ పొందూరు ఖాదీకి అభిమానులు.
చేప ముళ్లుతో ఇక్కడ నూలు వడికి, 40, 60, 80, 100 కౌంటులతో కూడిన వస్త్రాలు నేస్తారు. కేవీఐసీ(ముంబై) ఆధ్వర్యంలో పొందూరు ఏఎఫ్‌కేకే సంఘం ఉన్నప్పటికీ సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవా ర్డును అందించింది. త్వరలో నగదును అందించనుంది. ఏఎఫ్‌కేకే సంఘం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటీకీ కళలు, కళారంగంలో ప్రోత్సాహానికి గాను ఇస్తు న్న పురస్కారాల్లో భాగంగా ఏఎఫ్‌కేకే సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌టైమ్ అవార్డు అందించింది.
పొందూరులో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మల
<p>విధాత: రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. పొందూరులో జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని […]</p>
Latest News

కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్‌సోర్సింగ్‌పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో