విధాత: ఏపీ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకమయ్యారు. కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్లు ఆయన పనిచేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంగ్లాండ్, కెనడాలోని పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్ కుమార్ విధులు నిర్వహించారు. ఫిన్‌టెక్ సంస్థల్లో నిపుణుడిగా రజనీష్ ఉన్నారు. పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్ అనుభవం గడించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది.