జి.ఓ నెంబర్ – 77 రద్దు చేయాలి.. ఎస్ఎఫ్ఐ ధర్నా

విధాత‌: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం (NEP) వ్యతిరేకించాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రవేటికరణ ఆపాలని, […]

జి.ఓ నెంబర్ – 77 రద్దు చేయాలి.. ఎస్ఎఫ్ఐ ధర్నా

విధాత‌: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం (NEP) వ్యతిరేకించాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రవేటికరణ ఆపాలని, ఖాళీగా ఉన్నా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, జి.ఓ నెంబర్ 77 రద్దు చేయాలి. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన అమ్మఒడి వర్తింప చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని,డిగ్రీ లో తెలుగు మీడియం యధావిధిగా కొనసాగించాలనీ డిమాండ్ చేశారు.

కార్పెరేటు విద్యాసంస్థలు అధిక ఫిజులు వసూలు చేస్తున్నారని ముక్యంగా చైతన్య విద్యా సంస్థల వద్ద విద్యార్థుల, తల్లిదండ్రులు ధర్నా చేశారు.మా పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదుని. గోశాల చైతన్య క్యాంపస్‌లో మొదటి సంవత్సరం పూర్తి చేసిన వారికి.వారు సెకండ్ ఇయర్ మరో కాలేజ్‌లో చేరేందుకు తల్లిదండ్రులు టీసీలు అడుగుతుంటే ఇప్పటికే 1.40 లక్షలు చెల్లించామని ఇంకా రూ.40 వేలు చెల్లించాలంటూ చెబుతున్నారుని.ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ కాలేజి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడం కోసం ఎంతోమంది త్యాగధనులు, ప్రజల సహకారంతో ఎయిడెడ్ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంస్థలు నేటికీ పేద విద్యార్థుల చదువుకు ఆసరాగా ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం ఈ విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులు భర్తీని నిలిపివేసింది. నేడున్న ప్రభుత్వం ఏకంగా ఈ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తుంది. దీంతో పేద విద్యార్థులకు చదువు దూరమవుతుందిని అన్నారు.

SFI కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అమ్మఒడి, విద్య దీవెన, వసతి దీవెన పథకాలతో అందిస్తున్న డబ్బులతో ఎక్కడైనా చదువుకోమని ఉచిత విద్యను అందించే ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసివేస్తున్నారని ఇప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న పదకాలు ఆన్లైన్ లోపాల కారణంగా అందరికీ అందడం లేదుని. 2018 సంవత్సరం నుండి నేటి స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. జి.ఓ నెంబర్ 77 తీసుకువచ్చి ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన నిలిపివేసింది. రాష్ట్రంలో అందరు పి.జి చదువుకోవడానికి కావాల్సిన ప్రభుత్వ పిజి కళాశాలలు లేవుని. ఇటువంటి చర్యల వలన పేద విద్యార్థులకు పూర్తిగా చదువు దూరమవుతుంది. దీంతో పాటు ప్రభుత్వ సంస్థలు మూసివేయడం లేదా ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉండవుని. విద్య – ఉపాధి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటుందిని అన్నారు. ప్రభుత్వ సెలవులు కార్పెరేటు విద్యాసంస్థలు కూడా అమలు చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎన్. కోటి,జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సి.హెచ్. వెంకటేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు ఏసుబాబు, నగర నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.