విధాత: ఉదయగిరి బస్టాండ్ గురువారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, వైసీపీ నేత మూల వినయ్ రెడ్డికి మధ్య బస్తీమే సవాల్ అంటూ సాగిన పరస్పర సవాళ్లకు వేదిక అయింది. ఉదయగిరి వస్తే తనను తరిమికొడతామన్న వైసీపీ నేత సుబ్బారెడ్డి మాటలను సీరియస్గా తీసుకున్న మేకపాటి గురువారం ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కూర్చి వేసుకొని ఎవరు వస్తారో రమ్మంటూ చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. గంటన్నరపాటు ఎమ్మెల్యే బస్టాండ్లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. తాను గంటన్నర పార్టీ […]
విధాత: ఉదయగిరి బస్టాండ్ గురువారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, వైసీపీ నేత మూల వినయ్ రెడ్డికి మధ్య బస్తీమే సవాల్ అంటూ సాగిన పరస్పర సవాళ్లకు వేదిక అయింది. ఉదయగిరి వస్తే తనను తరిమికొడతామన్న వైసీపీ నేత సుబ్బారెడ్డి మాటలను సీరియస్గా తీసుకున్న మేకపాటి గురువారం ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కూర్చి వేసుకొని ఎవరు వస్తారో రమ్మంటూ చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. గంటన్నరపాటు ఎమ్మెల్యే బస్టాండ్లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.
తాను గంటన్నర పార్టీ ఇక్కడే ఉన్నా తనను తరిమి కొడతామన్న వైసీపీ నాయకులు ఎవరు రాలేదని వాళ్ళు మగాళ్లు అయితే ఎందుకు రాలేదని ఎద్దేవ చేశారు. ఉదయగిరిని అభివృద్ధి చేసింది తానేనన్నారు. ఎవడు పడితే వాడు నాయకులు కాలేరంటూ మేకపాటి విమర్శించారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మళ్ల ఎన్నికలు వచ్చే దాకా తాను గమ్ముగా ఉంటానని వాళ్లలో వాళ్లే టికెట్ కోసం కొట్లాడుకుంటారన్నారు.
అదే సమయంలోఎమ్మెల్యే మేకపాటికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన వైసీపీ నేత
మూల వినయ్ రెడ్డి కూడా బస్టాండ్ సెంటర్కు చేరుకుగా అప్పటికే మేకపాటి వర్గం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాము మేకపాటి బెదిరింపులకు భయపడేది లేదని తాను ఇక్కడే బస్టాండ్ సెంటర్లో కూర్చున్నానని, నేను వచ్చే లోగా ఆయన వెళ్లిపోయారని దమ్ముంటే ఇప్పుడు రావాలని సవాల్ విసిరారు.
నేను మగాడు కాదు అన్నాడు కదా అవునో కాదో తేల్చుకునేందుకు బస్టాండ్ దగ్గరే ఉన్నా.. రావాలని మేకపాటి కి సవాల్ విసిరారు. తాము ర్యాలీ తీసి భోజనానికి వెళ్ళామని ఆ సమయంలో బస్టాండ్ కి వచ్చి సవాలు విసరడం కాదని దమ్ముంటే ఇప్పుడు రావాలన్నారు.
ఎమ్మెల్యే మేకపాటి అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి అని, నాలుగు సార్లు గెలిచి ఆయన చేసింది ఏమీ లేదని అంతో ఇంతో చేసింది కేవలం మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటూ చంద్రశేఖర్ రెడ్డిపై వినయ్ రెడ్డి నిప్పులు చేరిగారు. తన వద్ద కూడా డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అని వినయ్ ప్రశ్నించారు . మేకపాటి, వినయ్ రెడ్డిల సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మేకపాటి VS వినయ్ | ఉదయగిరి బస్టాండ్లో కూర్చోని.. ఎవరు వస్తారో రమ్మంటూ మేకపాటి సవాల్ | Vidhaatha | Latest Telugu News https://t.co/cHCGFOz8gn #AP #ANDHRAPRADESH #Nellore #UDAYAGIRI #YCP #MekapatiChandrasekharreddy pic.twitter.com/WY0lYLL41t
— vidhaathanews (@vidhaathanews) March 30, 2023