Vineesha | తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ సాధించిన వినీష
Vineesha | ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన బడబాగ్ని వినీష తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ సాధించారు. మంగళవారం వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో ఆమెకు 821వ ర్యాంకు వచ్చింది. ఉదయగిరి మండలంలోని గంగులవారి చెరువుపల్లి గ్రామం వినీష సొంతూరు.
Vineesha : ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన బడబాగ్ని వినీష తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ సాధించారు. మంగళవారం వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో ఆమెకు 821వ ర్యాంకు వచ్చింది. ఉదయగిరి మండలంలోని గంగులవారి చెరువుపల్లి గ్రామం వినీష సొంతూరు. ఆమె తండ్రి శ్రీనివాసులు వ్యవసాయ శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. తల్లి విజయభారతి గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వినీష ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో జరిగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అమెరికాలో ఎంఎస్సీ చదివారు. అనంతరం గ్రూప్-1 పరీక్షలు రాసి మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు.
కాగా, వినీష తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ర్యాంకు సాధించడంపై కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినీష సోదరుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతను కూడా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. వినీష మారుమూల గ్రామంలో జన్మించి, చదువులో రాణించి సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram