WhatsApp : వాట్సాప్ సంచలన అప్డేట్!..పేరెంట్-మేనేజ్డ్ మోడల్!!
13 ఏళ్లలోపు పిల్లల కోసం వాట్సాప్ కొత్తగా ‘పేరెంట్-మేనేజ్డ్ మోడల్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తల్లిదండ్రులు పిల్లల అకౌంట్‌ను పర్యవేక్షించి కాంటాక్ట్స్, గ్రూప్స్‌ను నియంత్రించవచ్చు.
విధాత : ప్రముఖ మెసేజింట్ యాప్ గా కొనసాగుతున్న వాట్సాప్ కొత్తగా సంచలన ఆప్డేట్ తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్లు వాడుతున్న మైనర్ పిల్లల వాట్సాప్ ఖాతాలను పేరెంట్స్ స్వయంగా పర్యవేక్షించి నియంత్రించేలా సరికొత్త ఫీచర్ పేరెంట్-మేనేజ్డ్ మోడల్ ను ప్రవేశపెట్టంది. 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొత్తగా పేరెంట్-మేనేజ్డ్ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ దశలవారీగా యూజర్లకు, కొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఈ కొత్త మోడల్ తో పిల్లల మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ ఖాతాలను తల్లిదండ్రులు నియంత్రించవచ్చని వాట్సాప్ తెలిపింది. వీటిని తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సెటప్ చేయాల్సి ఉంటుందని, ఈ అకౌంట్ తల్లిదండ్రుల అకౌంట్‌తో లింక్ అయ్యి ఉంటుందని వెల్లడించింది.
దీంతో పిల్లలు మెసేజింగ్, కాలింగ్ మాత్రమే చేయగలరు అని, ఛానెల్స్, స్టేటస్, లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలు ఉండబోవని పేర్కొంది. అంతేకాదు ఎవరితో కాంటాక్ట్, ఏ గ్రూప్‌లో జాయిన్ కావాలన్నది కూడా తల్లిదండ్రులే నియంత్రించవచ్చని, అజ్ఞాత వ్యక్తుల నుంచి మెసేజ్ లు వస్తే తల్లిదండ్రులు చూసి అనుమతించవచ్చని వెల్లడించింది. పేరెంటల్ కంట్రోల్స్, ప్రైవసీ సెట్టింగ్స్ కోసం ఓ పిన్ ఉంటుందని, దాన్ని తల్లిదండ్రులు మాత్రమే మార్చగలరని వాట్సప్ పేర్కొంది. మెసేజులకు మాత్రం ఎప్పటిలానే ఎండ్-టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని..అందువల్ల సందేశాలను పేరెంట్స్ కూడా చదవలేరు అని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Monalisa | మోనాలిసా వివాహంపై అనేక ప్రచారాలు.. “ఇది లవ్ జిహాద్ కాదు” అంటూ క్లారిటీ
హైదరాబాద్ కు రండి : నెట్ ఫ్లిక్స్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram