నాగుపామును పట్టుకుని..నీళ్లు తాగించాడు!

తిరుపతి జిల్లా పుత్తూరులో ఇంట్లోకి వచ్చిన నాగుపామును స్నేక్ క్యాచర్ పట్టుకుని దానికి నీళ్లు తాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

snake catcher helps snake drinking water

విధాత : పాముల జాతులలో కోబ్రా రకం నాగుపాములు ప్రాణాంతకమైప విషం కలిగి అత్యంత డేంజర్ స్నేక్స్ గా గుర్తింపు పొందాయి. అలాంటి నాగు పామును ఓ స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకోవడంతో పాటు ఎండల ధాటికి దాహంతో అలమటిస్తున్న దానికి నీళ్లు తాగించిన వీడియో వైరల్ గా మారింది.

తిరుపతి జిల్లా పుత్తూరులో ఓ ఇంట్లోకి నాగుపాము చొరబడింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ వాటర్ ట్యాంకు కింద దాగిన నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ఆ పాముకు ఆయన నీళ్లు తాగించగా, అది సేద తీరింది. అనంతరం ఆ నాగు పామును అతను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వేసవిలో పాములు ఇళ్లలోకి రావచ్చని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

వైరల్ గా.. నల్లగొండ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల!
తేయాకు తోటలో దానిని చూసి పరుగే పరుగు!

Latest News