Snake | కాటేసిన పామును జేబులో వేసుకొని ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
సాధారణంగా పాము కాటేస్తే ఏం చేస్తాం..? వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తాం. అయితే, ఓ వ్యక్తి ఏకంగా కాటేసిన పాముతో దవాఖానకు వెళ్లి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అతడు చేసిన పనికి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు.
Snake | సాధారణంగా పాము (Snake) కాటేస్తే ఏం చేస్తాం..? వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తాం. అయితే, ఓ వ్యక్తి ఏకంగా కాటేసిన పాముతో దవాఖానకు వెళ్లి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అతడు చేసిన పనికి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన దీపక్ అనే 39 ఏండ్ల వ్యక్తి.. ఈ రిక్షా డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే, అతడిని ఓ పాము కాటేసింది. దీంతో అతడు ఆ పామును జేబులో వేసుకొని జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ హంగామా సృష్టించాడు. వైద్యుడి వద్దకు వెళ్లి తనకు పాము కాటేసిందని, చికిత్స చేయమని గోల చేశాడు. దీంతో డాక్టర్ ‘నీకు ఏ పాము కాటు వేసింది’ అని ప్రశ్నించాడు.
అంతే, వైద్యుడు ఆ ప్రశ్న వేయగానే దీపక్.. ‘ఇదిగోండి సార్.. ఇదే నా చేతిపై కాటు వేసింది’ అంటూ తన జేబులో నుంచి పామును తీసి అతడి ముందు ఉంచాడు. ఇది చూసిన వైద్యుడు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయాడు. వెంటనే తన సీటులో నుంచి లేచి పక్కకు పరుగులు తీశాడు. ఆ పామును బయట వదిలేయమని చెప్పారు. అయినా దీపక్ వినిపించుకోలేదు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే పామును పట్టుకుని బయటకు వదిలేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also |
NRI students palak paneer case| ఎన్నారై విద్యార్ధులకు రూ.1.8కోట్ల పాలక్ పనీర్ పరిహారం!
Sreeleela | రెట్రో లుక్ లో సావిత్రిని గుర్తు చేస్తున్న శ్రీలీల
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram