NRI students palak paneer case| ఎన్నారై విద్యార్ధులకు రూ.1.8కోట్ల పాలక్ పనీర్ పరిహారం!
లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో తలుపుతడుతుందోనన్న సామేతకు సరిగ్గా సరిపోతుంది అమెరికాలో భారతీయ విద్యార్థులను ఎదురైన సంఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం వేసిన ఓ కేసులో వచ్చిన తీర్పుతో ఇద్దరు ఎన్నారై విద్యార్ధులకు రూ.1.8కోట్ల పరిహారం దక్కడం విశేషం. ఈ వ్యవహారం తాజాగా వైరల్ గా మారింది.
విధాత : లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో తలుపుతడుతుందోనన్న సామేతకు సరిగ్గా సరిపోతుంది అమెరికాలో భారతీయ విద్యార్థులను ఎదురైన సంఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం వేసిన ఓ కేసులో వచ్చిన తీర్పుతో ఇద్దరు ఎన్నారై విద్యార్ధులకు రూ.1.8కోట్ల పరిహారం దక్కడం విశేషం. ఈ వ్యవహారం తాజాగా వైరల్ గా మారింది.
పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో ఆదిత్య ప్రకాశ్, ఉర్మి భట్టాచార్య పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో రెండేళ్ల క్రితం పాలక్ పనీర్ తయారీ సందర్బంగా నెలకొన్న వివాదంపై కోర్టులో దావా వేశారు. విద్యార్థులు పనీర్ వేడి చేస్తున్న సమయంలో ఘాటైన వాసన రావడంతో యూనివర్సిటీ సిబ్బంది ఒకరు అభ్యంతరం తెలిపారు. ఈ వివాదంపై ఆదిత్య ప్రకాశ్, ఉర్మి భట్టాచార్యలు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత వారికి ఈ వివాదంలో న్యాయం దక్కింది. దావా వేసిన ఇద్దరు భారతీయ విద్యార్థులు రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పాలక పనీర్ కేసు రూపంలో తమకు న్యాయమైన పరిహారం దక్కిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram