మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతుల డిఎ కేసుపై సుప్రీంకోర్టు విచారణ

విధాత‌: మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులపై సిబిఐ దాఖలు చేసిన డిఎ కేసుపై సుప్రీంకోర్టు బుధ‌వారం విచారణ జ‌రిగింది.అన్ని ఎవిడెన్స్‌లు తీసుకున్న తర్వాతే.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది.వీరితో పాటు.. మొత్తం 11మంది అధికారులపై ఈ వ్యవహారంలో విచారణ జరుగుతోందన్న సిబిఐ కేసు నమోదుకు ముందే.. వారి నివాసాల్లో సోదాలు జరిపి ఆధారాలు సేకరించామని,కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ప్రిలిమినరి ఎంక్వైరీ అవసరం లేదని వెల్ల‌డించింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే […]

మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతుల డిఎ కేసుపై సుప్రీంకోర్టు విచారణ

విధాత‌: మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులపై సిబిఐ దాఖలు చేసిన డిఎ కేసుపై సుప్రీంకోర్టు బుధ‌వారం విచారణ జ‌రిగింది.అన్ని ఎవిడెన్స్‌లు తీసుకున్న తర్వాతే.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది.వీరితో పాటు.. మొత్తం 11మంది అధికారులపై ఈ వ్యవహారంలో విచారణ జరుగుతోందన్న సిబిఐ కేసు నమోదుకు ముందే.. వారి నివాసాల్లో సోదాలు జరిపి ఆధారాలు సేకరించామని,కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ప్రిలిమినరి ఎంక్వైరీ అవసరం లేదని వెల్ల‌డించింది.

కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తమపై కేసు నమోదు చేశారన్న ఆదిమూలపు సురేష్‌ దంపతులు,ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా విచారణ చేపట్టారని… అందుకే తెలంగాణ హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేసిందని పేర్కొన్నారు. విచారణ గురువారం కూడా కొనసాగుతుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.