ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, అత్యంత చాకచక్యంగా నిందితున్ని అదుపులోకి తీసుకోవడంలో కానిస్టేబుల్ ప్రతిభ అభినందనీయం. విధాత:నిరంతరం వివిధ రకాల కేసులు పరిష్కారం లోనూ,బాధితులకు సత్వర న్యాయం అందించడంలోనూ,ఇతర సేవా కార్యక్రమాల్లోనూ,ప్రజలను ముందుండి రక్షించడంలో, క్రమశిక్షణ భరితమైన విధి నిర్వహణకు,వారి యొక్క ప్రతిభ ఆధారంగా సిబ్బందికి అవార్డులు అందచేయాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా,అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం లో జరిగిన ఎటువంటి ఆధారంలేని […]
ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, అత్యంత చాకచక్యంగా నిందితున్ని అదుపులోకి తీసుకోవడంలో కానిస్టేబుల్ ప్రతిభ అభినందనీయం.
విధాత:నిరంతరం వివిధ రకాల కేసులు పరిష్కారం లోనూ,బాధితులకు సత్వర న్యాయం అందించడంలోనూ,ఇతర సేవా కార్యక్రమాల్లోనూ,ప్రజలను ముందుండి రక్షించడంలో, క్రమశిక్షణ భరితమైన విధి నిర్వహణకు,వారి యొక్క ప్రతిభ ఆధారంగా సిబ్బందికి అవార్డులు అందచేయాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా,అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం లో జరిగిన ఎటువంటి ఆధారంలేని హత్య కేసును ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్-1786,జి. రామకృష్ణ కు ఈరోజు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్నారు.
ఆగస్టు నెల 21వ తేదీన మచిలీపట్నంలో బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేఖాన్ పేట మురుగు కాలవలో ఒక మూటలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభించగా, ఆ కేసు పోలీసులకు సవాలుగా మారింది. చుట్టుపక్కల ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, ఆ కేసును చాలెంజ్‌గా స్వీకరించారు.
ఆ కేసు దర్యాప్తులో చుట్టుపక్కల వారిని విచారించే సమయంలో రామకృష్ణ కేసు ఆధారాలు సేకరించడం లో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. వివరాలు సేకరించే క్రమంలో వారు చెరువుల వద్ద కాపలాగా వచ్చిన కుటుంబం అని, తన భర్త హత్య చేసి మూటలో కట్టి , కాలవలు పడేసి, అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తేలడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొవడంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం లేకుండానే కేసును సమయస్ఫూర్తిగా చేయించడంలో కీలక పాత్ర వహించిన కానిస్టేబుల్ కు ఎస్పీ. ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ కానిస్టేబుల్ యొక్క వివరాలు ఇప్పుడు సర్వీసులోకి వచ్చింది ఏ ఏ రకమైన విధులు ఇప్పటివరకు నిర్వర్తించింది అడిగి తెలుసుకున్నారు.
అంతేకాక ఈ కేసును ఛేదించడం లో సహకరించిన సిబ్బంది అందరిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్ పి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులను అందజేసి పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు అవార్డును అందుకున్న పోలీసు సిబ్బంది