ల‌క్ష‌లు సంపాదిస్తున్నా కూడా చెల్లికి ఆప‌రేష‌న్, పెళ్లి చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన ఆదిరెడ్డి

ల‌క్ష‌లు సంపాదిస్తున్నా కూడా చెల్లికి ఆప‌రేష‌న్, పెళ్లి చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన ఆదిరెడ్డి

ఆదిరెడ్డి.. ఈ పేరు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి బాగానే తెలిసి ఉంటుంది. బిగ్ బాస్ హౌజ్‌లోకి కామ‌న్‌మెన్‌గా వ‌చ్చి ఉన్నన్ని రోజులు త‌న ఆట‌ల‌తో తెగ సంద‌డి చేశాడు. బిగ్ బాస్ రివ్యూయ‌ర్‌గా ఉన్న ఆదిరెడ్డికి హౌజ్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ ద‌క్కింది. టాప్ 5లో నిలిచిన అత‌ను ఇప్పుడు తిరిగి యూట్యూబ్‌లో తెగ సంద‌డి చేస్తూ ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. కామన్ మాన్ బిగ్ బాస్ హౌజ్‌లో టాప్ 5కి రావడం అదే తొలిసారి కావ‌డంతో ఆదిరెడ్డికి మాత్రం అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన గురించే కాకుండా ఆయన కుటుంబ గురించి కూడా అందరు దృష్టి పెట్టారు. ఆదిరెడ్డికి నాగలక్ష్మి అనే చెల్లెలు ఉండ‌గా, ఆమెకి కళ్లు కనిపించవు. బిగ్ బాస్ స్టేజీపైకి కూడా వచ్చి నాగార్జున‌తో క‌లిసి తెగ సంద‌డి చేసింది.

బెంగుళూరులో చిన్న జాబ్ చేసుకుంటూ ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు ప‌డిన ఆది రెడ్డి.. బిగ్ బాస్ షో గురించి మాట్లాడే తీరుకి ఫిదా అయిపోయారు.బిగ్ బాస్ రివ్యూవర్ గా ఆదిరెడ్డి సంపాదన నెలకు లక్షల్లోకి చేరింది.ఒకప్పుడు ఆదిరెడ్డి వాళ్ళ అమ్మ ఒంటిపై కనీస నగలు ఉండేవి కావ‌ని. ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తే బంధువుల నగలు పెట్టుకొని వెళ్లేదట. ఆర్ధిక ఇబ్బందుల వ‌ల్ల‌నే త‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని కూడా ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. ఆ మధ్య తనకు నెలకు రూ.39 లక్షల ఆదాయం వస్తున్నట్లు లెక్కలతో సహా చూపించాడు.కొత్తగా ఒక భారీ ఇల్లు కూడా నిర్మిస్తున్నాడు.

భారీగా సంపాదిస్తున్న ఆదిరెడ్డి త‌న చెల్లికి మాత్రం కంటికి ఆప‌రేష‌న్ చేయించ‌డం లేదు, పెళ్లి కూడా చేయడం లేదు. దీనిపై చాలా సార్లు ఆదిరెడ్డిని ప్ర‌శ్నించారు. దానిపై తాజాగా స్పందిస్తూ.. తన చెల్లెలు నాగలక్ష్మికి కంటి సమస్య ఉన్న మాట వాస్తవం అని కానీ ఆమెకు కను గుడ్ల బాగానే ఉన్న నరాలు సరిగ్గా లేవని తెలియ‌జేశాడు. నరాలు సరిగ్గా లేకే ఆమెకు కళ్లు కనిపించట్లేదని.. ఇప్పుడు ఆపరేషన్ చేయించి కనుగుడ్లు మార్పించినా కళ్లు కనిపించవని తెలియ‌జేశారు. ఒకే ఒక కన్ను ఐదు శాతం మాత్రమే కనిపిస్తుందని.. కానీ ఓ ఇంట్లో పది నిమిషాలు ఆమె తిరిగితే అన్నీ గుర్తు పెట్టుకుని కాన్ఫిడెంట్ గా నడుస్తుందని చెప్పుకొచ్చారు. తన భార్య కవితే దగ్గరుండి ఆమెకి సంబంధించినవ‌న్నీ అన్ని చూసుకుంటుంద‌ని ఆదిరెడ్డి అన్నారు. పెళ్లి చేస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. అందుకే పెళ్లి చేయలేదని ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చాడు