Sri Satya | శ్రీసత్య ముందు.. బార్బీ కూడా బలాదూరే
Sri Satya | చూడగానే అబ్బా అనిపించే అందాల ముద్దుగుమ్మలలో శ్రీసత్య ఒకరు. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీసత్య.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. తొందర పడకు సుందరవదన సీజన్ 1 & 2 సిరీస్‌లతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అందాల ముద్దుగుమ్మ బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లోనూ నటించింది. జోయాలుక్కాస్ జ్యువెలరీ, కృష్ణ జ్యువెలర్స్ వంటి జ్యువెలరీ బ్రాండ్‌ల ఫోటోషూట్‌లలో కూడా కనిపించిన ఈ ముద్దుగుమ్మ […]

Sri Satya |
చూడగానే అబ్బా అనిపించే అందాల ముద్దుగుమ్మలలో శ్రీసత్య ఒకరు. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీసత్య.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. తొందర పడకు సుందరవదన సీజన్ 1 & 2 సిరీస్‌లతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అందాల ముద్దుగుమ్మ బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లోనూ నటించింది.
జోయాలుక్కాస్ జ్యువెలరీ, కృష్ణ జ్యువెలర్స్ వంటి జ్యువెలరీ బ్రాండ్‌ల ఫోటోషూట్‌లలో కూడా కనిపించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ షోలో సత్య తన ముద్దు ముద్దు మాటలతో పాటు అర్జున్‌తో చేసిన హంగామా అందరి దృష్టిని ఆకర్షించింది.
View this post on Instagram
విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీసత్య ఎంబీబీఎస్ చదివి, ఆ తర్వాత మోడలింగ్ అండ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో 2015 మిస్ విజయవాడ పోటీలో పాల్గొని టైటిల్ దక్కించుకుంది. 2016 లో వచ్చిన నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా ఒక చిన్నపాత్రలో మెరిసిన ఈ భామ ముద్దమందారం, త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి సీరియల్స్ లో నటించి అలరించింది.
ఇక లవ్ స్కెచ్, తరుణం, అంత భ్రాంతియేనా, తొందరపడకు సుందర వదన వంటి పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్‌లలో కూడా శ్రీ సత్య తన నటనతో మెప్పించింది.అయితే నిజ జీవితంలో లవ్ లో ఫెయిల్ అయిన సత్య మళ్లీ లవ్ జోలికే పోనంటుంది.
View this post on Instagram