బ‌చ్చ‌న్ ఫ్యామిలీకి దూరంగా ఐశ్వ‌ర్య‌రాయ్.. విడాకుల వార్త‌లు నిజ‌మేనా?

బ‌చ్చ‌న్ ఫ్యామిలీకి దూరంగా ఐశ్వ‌ర్య‌రాయ్.. విడాకుల వార్త‌లు నిజ‌మేనా?

గ‌త కొద్ది రోజులుగా ఐశ్వ‌ర్య‌రాయ్, అభిషేక్ బ‌చ్చ‌న్ విడాకుల వార్తల గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. అయితే దీనిని అభిషేక్ బ‌చ్చ‌న్ కాని, ఐశ్వర్య‌రాయ్ కాని ఏ మాత్రం ఖండించ‌లేదు. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కూడా డివోర్స్ ఆలోచనలోనే ఉన్నారంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా వారి విడాకుల‌పై రూమ‌ర్స్ మ‌రింత ఊపందుకున్నాయి. దీంతో ఐష్ ఫ్యాన్స్ తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. కొద్ది రోజులుగా జయబచ్చన్ తో ఐశ్వర్య రాయ్ పూర్తిగా మాట్లాడటం లేదని, త్వరలోనే ‘బచ్చన్’ హౌజ్ నుంచి వెళ్లిపోతుందంటూ ప్ర‌చారాలు ఎక్కువ‌య్యాయి. దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌త లేక‌పోయిన నెట్టింట ఈ వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో అభిమానులు కంగారు చెందుతున్నారు.

అయితే ఇటీవ‌ల అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వర్యరాయ్ ఓ ఈవెంట్‌కి హాజ‌రు కాగా, ఆ ఈవెంట్‌లో ఇద్ద‌రు చాలా క్లోజ్‌గానే క‌నిపించారు. ఇటీవ‌ల వారి కూతురికి సంబంధించిన ఈవెంట్‌లోను జంట‌గానే క‌నిపించారు. అమితాబ్ బచ్చన్ కూడా కొడుకు కోడలితో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఫ్యామిలీ అంతా ఎంతో అన్య‌న్యంగా ఉన్నార‌ని మ‌న‌కు వీటిలో క‌నిపిస్తున్నా కూడా ఎందుకు వారి విడాకుల వార్త‌లు అంత జోరందుకున్నాయో అర్ధం కావ‌డం లేదు. రీసెంట్‌గా మాత్రం ఒక వీడియోలో ఐశ్వ‌ర్యరాయ్.. జయబచ్చన్ తో స‌రిగ్గా మాట్లాడటం లేదంటూ కొందరూ చూపిస్తున్నారు. వారి మ‌ధ్య వ‌చ్చిన గొడ‌వ‌ల వ‌ల్ల‌నే విడాకులు తీసుకున్నార‌నే టాక్ న‌డుస్తుంది.

ఇక అందాల తార ఐశ్వర్య రాయ్ గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన అంద చందాలతోనే కాదు నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఆమె తన కెరీర్ పీక్‌లో ఉండగానే.. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఆరాధ్య అనే కూతురు ఉంది. ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ వివాహమై 16 ఏళ్లు కాగా, అభిషేక్ బచ్చన్ ఇటీవ‌ల తొలిసారి పెళ్లి ఉంగరం ధరించకుండా పబ్లిక్‌గా కనిపించాడు. పెళ్లి ఉంగరం లేకుండా అభిషేక్ ఎప్పుడూ కనిపించలేదు. అల‌ కనిపించడంతో కూడా ఐశ్వ‌ర్య‌రాయ్ విడాకుల‌కి సంబంధించి ప్ర‌చారాలు సాగాయి.