ఏంటి ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌తో బ‌ర్రెల‌క్క పెళ్లా.. సీక్రెట్ మ్యారేజ్‌పై షాకింగ్ రియాక్ష‌న్

  • By: sn    breaking    Jan 31, 2024 11:29 AM IST
ఏంటి ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌తో బ‌ర్రెల‌క్క పెళ్లా.. సీక్రెట్ మ్యారేజ్‌పై షాకింగ్ రియాక్ష‌న్

సోష‌ల్ మీడియాలో నిత్యం కొన్ని వేల కొల‌ది వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క నెటిజ‌న్స్ అయోమ‌యానికి గుర‌వుతుంటారు. రీసెంట్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 7 విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్, యూట్యూబ్ సంచ‌ల‌నం బ‌ర్రెల‌క్క ఇద్ద‌రు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై బర్రెల‌క్క ఘాటుగా స్పందించింది. ప్ర‌శాంత్,బ‌ర్రెల‌క్క సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న‌ట్టు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్ర‌చారాలు చేశాయి. ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన వారు కాబ‌ట్టి వివాహం చేసుకున్నార‌ని ప్ర‌చారం చేశారు. పెళ్లి అయిన‌ట్టు కొన్ని మార్ఫింగ్ ఫొటోలు కూడా క్రియేట్ చేశారు. ఇవి బ‌ర్రెల‌క్క ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో ఆమె స్పందించింది.

ప్రశాంత్‌ అన్న రైతు కుటుంబం నుంచి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు తన సపోర్ట్ ఉందని, ఆయనకు సపోర్ట్ చేయాలని తాను వీడియో చేసిన‌ట్టు బ‌ర్రెల‌క్క పేర్కొంది. అన్న అని క్లియ‌ర్‌గా అత‌డిని పిలిచాను. అలాంటి అన్న‌తో వివాహం అని ఎలా త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేస్తారు. వ్యూస్ కోసం తప్పుడు ప్ర‌చారాలు చేస్తూ త‌మ ప‌రువుని బ‌జారున ప‌డేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇది తమ లైఫ్‌ అని, తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ కూడా వార్నింగ్‌ ఇచ్చింది. పల్లవి ప్రశాంత్‌ని తాను మొదట్నుంచి అన్నా అనే పిలిచానని, అన్నని ఎలా పెళ్లి చేసుకుంటారని, ఇదెక్కడి సంస్కృతి అంటూ ఆమె ప్రశ్నించింది. ఇలాంటి తప్పుడు ప్ర‌చారాలు మానుకోవాలని కూడా బర్రెల‌క్క పేర్కొంది.

బ‌ర్రెల‌క్క అస‌లు పేరు శిరీష కాగా, ఆమె నిరుద్యోగిగా ఆమె యూట్యూబ్‌లో పెట్టిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమె స్టార్ అయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూడా ఆమె ఫుల్ పాపుల‌ర్ అయింది. ఇక స్టేట్‌ మొత్తం అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఇటీవ‌లి కాలంలో బర్రెల‌క్క‌ యూట్యూబ్‌ ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ తెగ సంద‌డి చేస్తుంది. ఇక ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ బిగ్ బాస్ విన్న‌ర్ అయిన త‌ర్వాత కొద్ది రోజులు జైలుకి కూడా వెళ్లాడు.