ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మెహ్రీన్ ఇప్పుడు కాస్త స్లో అయింది. బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అందాల డోస్ పెంచిన కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అందాల విధ్వంసం సృష్టిస్తుంది. అయితే కొన్ని నెలల క్రితం మెహ్రీన్.. హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, బిజెపి ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకుంది. అట్టహాసంగా జరిగిన వారి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వారిద్దరు పెద్ద షాక్ ఇచ్చారు. కొన్ని కారణాల వలన వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేశారు.
నిశ్చితార్థం తర్వాత మెహ్రీన్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ విధ్వంసం సృష్టిస్తుంది. మరోవైపు భవ్య బిష్ణోయ్.. ఓ ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం భవ్య బిష్ణోయ్ బిజెపి పార్టీ తరుపున అదంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తాతగారు భజన లాల్ దాదాపు 13 ఏళ్ళు హర్యానా ముఖ్యమంత్రిగా ఉండగా, తండ్రి కులదీప్ బిష్ణోయ్ గతంలో ఎంపీగా పనిచేశారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఈ రేంజ్ లో ఉంది కాబట్టే మెహ్రీన్ అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కాని ఏం జరిగిందో ఏమో కాని వారి బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. అయితే భవ్య బిష్ణోయ్ డిసెంబర్ 22న పరి బిష్ణోయ్ అనే ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగింది.
పరి బిష్ణోయ్ రాజస్థాన్ కి చెందిన అమ్మాయి కాగా, వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. ఆ తర్వాత పుష్కర్, అదంపూర్, ఢిల్లీ నగరాల్లో మూడు రిసెప్షన్స్ జరగనున్నాయి. పెళ్లి, మూడు రిసెప్షన్స్ కి సుమారు 3 లక్షల మందిని ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. భవ్య బిష్ణోయ్ ఎమ్మెల్యేగా ఉన్న అదంపూర్ లో నిర్వహించే రిసెప్షన్ కి దాదాపు 80 గ్రామాల ప్రజలని ఆహ్వానిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. భజన్ లాల్ టైం నుంచి ఆ నియోజకవర్గంలో వీరికి మంచి పట్టు ఉండడంతో అందరిని ఆహ్వానించబోతున్నట్టు సమాచారం. ఊహకి అందని బడ్జెట్తో ఈ పెళ్లి జరగనుందని సమాచారం.భవ్య బిష్ణోయ్ తండ్రి కులదీప్ పెళ్లికి కూడా అన్ని ఊర్ల ప్రజలు వచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు.