Kaleshwaram | కాళేశ్వ‌రం కుంభ‌కోణంపై సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు

Kaleshwaram |  కాళేశ్వ‌రం కుంభ‌కోణంపై సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు

Kaleshwaram | కాళేశ్వ‌రం కుంభ‌కోణం, మేడిగ‌డ్డ బ్యారేజీ న‌ష్టంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, సంబంధిత ఇరిగేష‌న్ అధికారులు, కాంట్రాక్ట‌ర్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్ ప్ర‌వీణ్ కుమార్ శ్రీవాస్త‌వ్‌కు కాంగ్రెస్ నాయ‌కులు బ‌క్క జ‌డ్స‌న్ ఫిర్యాదు చేశారు.

మ‌హాదేవ‌పూర్ వ‌ద్ద సాగు, తాగునీటి నిమిత్తం.. మేడిగ‌డ్డ వ‌ద్ద రూ.1 లక్ష 35వేల కోట్ల‌తో సాగు, తాగునీటి ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. సీఎం కేసీఆర్ స్వ‌యానా ప్లానింగ్ డిజైన్ చేసి 2019 సంవత్సరంలో ప్రాజెక్టు మొదలుపెట్టి కేవలం 19 నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ మూడున్నర సంవత్సరాల్లోనే నాణ్యత లోపించిన కారణంగా, బ్యారేజ్ ఏడు గేట్లు పనికిరాకుండా పోయాయి. పిల్ల‌ర్లు 5 ఫీట్ల మేర కుంగిపోయాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్రజాధనాన్ని రికవరీ చేయించి, దానికి సంబంధించిన అవినీతి పరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌కు బ‌క్క జ‌డ్స‌న్ ఫిర్యాదు చేశారు.