తీర్థాన్ని త‌ల‌కు రాసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పూజా కార్య‌క్ర‌మాలు, ప్ర‌ద‌క్షిణ‌లు ముగిసిన త‌ర్వాత‌.. పురోహితులు అందించే తీర్థం ద‌గ్గ‌ర వాలిపోతారు. ఇక తీర్థం తీసుకొని, ఆల‌యం నుంచి బ‌య‌ట‌ప‌డుతారు. మ‌రి తీర్థం తీసుకున్న త‌ర్వాత చాలా మంది భ‌క్తులు త‌ల‌పై రాసుకుంటారు. ఇది ఎంత వ‌ర‌కు మంచిద‌నే విష‌యాన్ని తెలుసుకుందాం..

  • Publish Date - March 30, 2024 / 01:48 AM IST

ప్ర‌తి రోజు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు న‌చ్చిన ఆల‌యాల‌కు వెళ్తుంటారు. అక్క‌డ దేవుళ్ల‌కు ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించి, మొక్కులు స‌మ‌ర్పించుకుంటారు. కొంద‌రైతే దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటారు. పూజా కార్య‌క్ర‌మాలు, ప్ర‌ద‌క్షిణ‌లు ముగిసిన త‌ర్వాత‌.. పురోహితులు అందించే తీర్థం ద‌గ్గ‌ర వాలిపోతారు. ఇక తీర్థం తీసుకొని, ఆల‌యం నుంచి బ‌య‌ట‌ప‌డుతారు. మ‌రి తీర్థం తీసుకున్న త‌ర్వాత చాలా మంది భ‌క్తులు త‌ల‌పై రాసుకుంటారు. ఇది ఎంత వ‌ర‌కు మంచిద‌నే విష‌యాన్ని తెలుసుకుందాం..

ఆల‌యాల్లో తీర్థాన్ని చేతుల్లో పోస్తుంటారు. ఆ త‌ర్వాత దాన్ని మ‌నం సేవించి, కాస్త మిగిలించి దాన్ని త‌ల‌పై రాసుకుంటాం. కానీ ఇలాంటి చేయ‌డం మంచిది కాద‌ని జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు. చేతులు జోడించి దేవుళ్ల‌కు ప్రార్థన చేయొచ్చు.. కానీ తీర్థాన్ని తీసుకున్న త‌ర్వాత చేతుల‌ను త‌ల‌పై రాసుకోకూడ‌ద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఎందుకంటే.. ఆ తీర్థాన్ని పంచామృతంతో త‌యారు చేస్తారు. అందులో చ‌క్కెర‌, తేనే వంటివి ఉంటాయి. ఈ రెండు ప‌దార్థాలు కూడా జుట్టుకు మంచిది కాదు. తుల‌సి తీర్థం కూడా త‌ల‌కు రాసుకోవ‌డం మంచిది కాదు. తీర్థం తీసుకున్న త‌ర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది. ఆ ఎంగిలి చేతిని త‌ల‌కు రాసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు క‌ల‌గ‌వని పండితులు చెబుతున్నారు. కాబ‌ట్టి తీర్థం తీసుకున్న త‌ర్వాత ఆ చేతుల‌ను నీటితో క‌డ‌గాలి. లేదా జేబు రుమాలుతో తుడుచుకోవ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు. 

Latest News