జబర్ధస్త్ షోతో మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఫైమా ఒకరు. ఈమె యాక్టింగ్, పంచులతో తెగ ఫేమస్ అయిపోయింది. బుల్లెట్ భాస్కర్ టీంలో ఫైమా కామెడీ ఆమెని ప్రత్యేకంగా హైలైట్ అయ్యేలా చేసింది. ఇక జబర్ధస్త్ క్రేజ్‌తో ఫైమా కి బిగ్ బాస్ సీజన్ 6 ఛాన్స్ కూడా దక్కింది. ఈ షోలో ఫైమా మగాళ్లతో పోటీ పడి మరి ఆడింది. ఫైమా టాలెంట్ చూసి ప్రతి ఒక్కరు షాకయ్యారు. ఇక ఫైమా ఎప్పుడూ సోషల్ మీడియాలో చలాకీగా ఉంటూ రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఫైమాకు ఏం జరిగిందంటూ, క్లారిటీ ఇవ్వాలని కొందరు కోరుకుంటున్నారు. ఎప్పుడూ తన కామెడీతో నవ్వించే ఫైమా.. ఇప్పుడు ఆసుపత్రిలో చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించడం కొంత ఆందోళన కలిగిస్తుంది. వీడియో చూస్తే ఫైమాకు బ్లడ్ టెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ తనకు ఏం అయ్యిందనే విషయాన్నిఆమె నేరుగా చెప్పలేదు. ప్రస్తుతం ఫైమా వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుండగా, ఆమెకి ఏం జరిగిందని ?.. ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఫైమా పటాస్ షోకు ఆడియెన్‌గా వెళ్లి కంటెస్టెంట్ అయ్యింది. ఆ షోలో తనదైన పంచ్‌లతో అందరించింది.
పటాస్ షోలో ఫైమా క్లిక్ కావడంతో ఆమె ప్రయాణం జబర్ధస్త్ వైపు అడుగులు వేసింది. ఇక జబర్ధస్త్‌లో తనదైన మేనరిజమ్, టైమింగ్‌తో పాటు డ్యాన్స్‌తోనూ సందడి చేసింది. ఫైమా తల్లి తన కూతురిని చాలా కష్టపడి పెంచింది. బీడీలు చుట్టగా వచ్చిన డబ్బుతో అమ్మ తమను పెంచి పోషించిందని ఆమె హౌస్‌లో ఉన్న సమయంలో చెప్పింది. అమ్మకు ఓ మంచి ఇల్లు కట్టిఇవ్వాలనేదే తన కోరిక అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన ఫైమా తన తల్లి కూతురిని ఈ మధ్యే నెరవేర్చింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ఫైమా కొత్తింటి గృహ ప్రవేశ కార్యక్రమానికి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే సూర్య తదితరులు హజరై సందడి చేశారు.