Kushi Kapoor | జాన్వీ కపూర్ సోదరి అలాంటి వ్యాధితో బాధపడుతుందా.. నయనం కాని ఆ వ్యాధి లక్షణాలు ఏంటి?
Kushi Kapoor | బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. తనకు ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్ (IBS) ఉందని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది సెలబ్రిటీ గాసిప్‌కే పరిమితం కాకుండా, చాలా మందికి తెలియని జీర్ణ సంబంధిత సమస్యపై దృష్టిని ఆకర్షించింది.
Kushi Kapoor | బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. తనకు ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్ (IBS) ఉందని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది సెలబ్రిటీ గాసిప్‌కే పరిమితం కాకుండా, చాలా మందికి తెలియని జీర్ణ సంబంధిత సమస్యపై దృష్టిని ఆకర్షించింది. ఓర్రీ (ఓర్హాన్ అవత్రామణి)తో జరిగిన ఒక వీడియో ఇంటరాక్షన్‌లో “నీ జీవితంలో ఎప్పుడూ నిన్ను వెంటాడేది ఏది?” అనే ప్రశ్నకు ఖుషీ కపూర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి మొహమాటం లేకుండా ఆమె “ఐబీఎస్” అని చెప్పింది. గత కొంతకాలంగా ఈ సమస్య తన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో కూడా ఆమె పరోక్షంగా వెల్లడించింది.
ఖుషీ మాటలతో వెలుగులోకి వచ్చిన ఈ ఐబీఎస్ అసలు ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు చాలామందిలో తలెత్తుతోంది. ఇది ప్రేగుల పనితీరును ప్రభావితం చేసే దీర్ఘకాలిక జీర్ణవ్యాధి. కడుపు నొప్పి, ఉబ్బరం, విరోచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలతో ఇది బాధితులను ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం ఐబీఎస్ ప్రాణాంతక వ్యాధి కాదు. కానీ దీని వల్ల జీవన నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. జీర్ణనాళం, మెదడు మధ్య సమన్వయం సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడి, గతంలో వచ్చిన తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఈ సమస్యకు కారణాలుగా భావిస్తున్నారు.
ఈ సమస్యను పూర్తిగా నివారించడం కష్టమైనా, నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారపు అలవాట్లు, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమమైన వ్యాయామం వంటివి ఐబీఎస్‌ను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యోగా, ధ్యానం వంటి పద్ధతులు మానసిక ప్రశాంతతను ఇచ్చి లక్షణాలను తగ్గించగలవని చెబుతున్నారు.
ఖుషీ కపూర్ లాంటి యువ సెలబ్రిటీలు తమ ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల, ఐబీఎస్ వంటి వ్యాధులపై అవగాహన పెరుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది చాలామందికి “నాకే ఇలా జరుగుతోంది” అనే భయం తగ్గించి, సరైన చికిత్స వైపు అడుగులు వేయడానికి ప్రోత్సాహం కలిగిస్తుందని అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram