No More Gossip | ఆ గ్రామంలో పుకార్ల‌కు తావులేదు.. అలా చేస్తే రూ.5వేలు ఫైన్‌

చాడీలు చెప్పినా (No More Gossip), అస‌త్యాలు ప్ర‌చారం చేసినా రూ.5 వేలు ఫైన్ వేసేలా ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బలోద్ (Balod) జిల్లాలో ఉండే మేదకీ (Medaki) గ్రామ ప్ర‌జ‌లు ఓ తీర్మానం చేశారు.

No More Gossip | ఆ గ్రామంలో పుకార్ల‌కు తావులేదు.. అలా చేస్తే రూ.5వేలు ఫైన్‌

No More Gossip | ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సాయంత్రం అయితే చాలు అంతా ఒక ద‌గ్గ‌ర‌ చేరి ముచ్చ‌ట్లు ఆడుతుంటారు. అలా లేనిపోని విషయాలు మాట్లాడుకుంటూ.. ఒకరిపై ఒకరు చాడీలు (Gossip) చెప్పుకుంటుంటారు. ఇలాంటి గాసిప్స్ బంధువులు, స్నేహితుల మధ్య అనవసరమైన మనస్పర్థలు, గొడవలకు దారితీస్తుంటాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని ఒక గ్రామం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చాడీలు చెప్పేవారికి భారీ జ‌రిమానా విధించే క‌ఠినమైన నిబంధనను అమ‌ల్లోకి తెచ్చింది.

ఇంత‌కీ ఆ గ్రామం ఏదంటే..? బలోద్ (Balod) జిల్లాలో ఉండే మేదకీ (Medaki) అనే గ్రామం. ఎవ‌రైనా స‌రే చాడీలు చెప్పినా, అస‌త్యాలు ప్ర‌చారం చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామ క‌మిటీ తీర్మానం చేసింది. అలాంటి వారికి రూ.5 వేలు ఫైన్ వేయాల‌ని నిర్ణ‌యించింది. సోష‌ల్ మీడియా ద్వారా గాసిప్స్‌ను వ్యాప్తి చేసినా ఫైన్ వ‌ర్తిస్తుందని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసేవారి గురించి గ్రామ క‌మిటీకి ఫిర్యాదు చేస్తే వారికి న‌గ‌దు బ‌హుమ‌తి కూడా ఇవ్వ‌నున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల గ్రామంలో మంచి వాతావ‌ర‌ణం నెల‌కొని ఇరుగుపొరుగు వారి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు, మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండ‌వ‌ని వారి న‌మ్మ‌కం.

ఈ నిర్ణయం మొత్తం సమాజ సంక్షేమం కోసమేనని, ఏ వ్యక్తినీ లక్ష్యంగా చేసుకుని తీసుకున్న‌ది కాద‌ని స్థానికులు తెలిపారు. ఒక‌ప్పుడు ప్ర‌శాంతంగా ఉన్న గ్రామ వాతావ‌ర‌ణం పుకార్లు, అపార్థాల కార‌ణంగా దెబ్బ‌తిన్న‌ద‌ని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధ‌నవ‌ల్ల గ్రామంలో శాంతి, సామ‌ర‌స్యం పెరుగుతాయ‌ని భావించి ఈ తీర్మానం చేసిన‌ట్లు వివ‌రించారు.

ఇవి కూడా చదవండి :

Bihar Wedding | పెళ్లి జ‌రుగుతుండ‌గా.. వ‌ధువును షూట్ చేసిన ప్రియుడు
Delivery On Horse : గుర్రంపై ఆన్ లైన్ డెలివరీ.. వైరల్ వీడియో!