Bihar Wedding | పెళ్లి జ‌రుగుతుండ‌గా.. వ‌ధువును షూట్ చేసిన ప్రియుడు

బీహార్ (Bihar)లో ఓ పెళ్లి (Bihar Wedding) వేడుకలో విషాదం చోటు చేసుకుంది. స్టేజ్‌పై వ‌రుడి ప‌క్క‌నే ఉన్న వ‌ధువును (bride) ఆమె ప్రియుడు తుపాకీతో కాల్చాడు. దీంతో బుల్లెట్ ఆమె క‌డుపులోకి దూసుకెళ్లింది.

Bihar Wedding | పెళ్లి జ‌రుగుతుండ‌గా.. వ‌ధువును షూట్ చేసిన ప్రియుడు

Bihar Wedding | బీహార్‌లో ఓ పెళ్లి (Bihar Wedding) వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ప‌చ్చ‌ని పందిరి నెత్తురోడింది. వివాహం జ‌రుగుతుండ‌గా.. పెళ్లి కూతుర్ని (bride) ఓ యువ‌కుడు తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ ఆమె క‌డుపులోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావ‌మై ప్రాణాపాయ స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

బ‌క్స‌ర్‌లోని (Buxar) చౌసా నగర్ పంచాయతీ పరిధిలోని మల్లా తోలా గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఆర్తి కుమారికి ఓ యువ‌కుడితో వివాహం నిశ్చ‌యమైంది. మంగ‌ళ‌వారం రాత్రి వీరి వివాహ వేడుక జ‌రుగుతోంది. పెళ్లి వేదిక‌పై వ‌ధూవ‌రులిద్ద‌రూ నిల్చొని ఉన్నారు. పెళ్లి తంతులో భాగంగా ఇరు కుటుంబ స‌భ్యులు కార్య‌క్ర‌మాలు సాగిస్తున్నారు. ఆర్తి కుమారి సోదరి వ‌ధూవ‌రులిద్ద‌రికీ హార‌తిచ్చి తిల‌కం దిద్దుతోంది. సరిగ్గా అదే సమయంలో అతిథుల మధ్యలో ఉన్న దీనబంధు అనే యువకుడు ఆర్తిపై కాల్పులు జరిపాడు.

బుల్లెట్ నేరుగా ఆర్తి పొట్టలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డి స్టేజ్‌పైనే కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌తో అతిథులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. వ‌ధువును వెంట‌నే స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా, నిందితుడు దీనబంధు.. ఆర్తిని గ‌త కొంత‌కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే, ఆమె అత‌డి ప్రేమ‌ను తిర‌స్క‌రించిన‌ట్లుగా తెలిసింది. అందుకే ఈ చ‌ర్య‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విచార‌ణ నిమిత్తం అత‌డి త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Youtuber Anvesh : యూ ట్యూబర్ అన్వేష్ పై లుక్ అవుట్ నోటీసులు !
Hyderabad Rains | హైదరాబాద్ లో మారిన వాతావరణం..పలుచోట్ల వర్షాలు